Begin typing your search above and press return to search.

ఆయన ఐడియా వర్కవుట్ అయినట్లుందే

By:  Tupaki Desk   |   7 May 2018 4:27 AM GMT
ఆయన ఐడియా వర్కవుట్ అయినట్లుందే
X
ఈ మధ్యన ఓ బడా నిర్మాత.. ఓ సినిమా ఫంక్షన్ కు వచ్చి.. సినిమాకు నెగిటివ్ టాక్ ను స్ప్రెడ్ చేయడానికి కొన్ని శక్తులు సిద్ధంగా ఉన్నాయనేలా మాట్లాడారు. స్టేజ్ వెనుక ఏం జరుగుతోందో మాకు మాత్రమే తెలుసు అంటూ హింట్ కూడా ఇచ్చారాయన. విచిత్రం ఏంటంటే.. ఈ సినిమాకు ఈయన నిర్మాత కాదు.. పైసా పెట్టుబడి చేయలేదు. కానీ.. ఈ మూవీకి ఆయనకు ఉన్న లింక్ ఏంటంటే.. స్టార్ హీరోగా వరుస విజయాలతో వెలుగుతున్న ఆయన కొడుకే ఈ సినిమాలో హీరో.

ఓ మూవీ రిలీజ్ కు ముందు.. స్వయంగా ఆ మూవీకి చెందిన వ్యక్తులే నెగిటివ్ టాక్ గురించి ఎందుకు మాట్లాడి ఉంటారో అప్పుడెవరికీ అర్ధం కాలేదు. తీరా ఆ సినిమా థియేటర్లలోకి వచ్చింది. వచ్చిన రోజు నుంచే మిక్సెడ్ టాక్ తెచ్చుకుంది. హానెస్ట్ గా.. కమిట్మెంట్ తో తీశామని మేకర్స్ చెప్పిన మాటలనే.. కొందరు ప్రేక్షకులు చెబుతున్నారు. ఈ జోనర్ అంతగా మెచ్చలేకపోయిన వారు.. మేకింగ్ లో లోపాలను పట్టుకుని రంధ్రాన్వేషణ చేసేవారు మాత్రం నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేస్తున్నారు.

ఇక్కడే ఆ తండ్రి వేసిన పాచిక పారిందని చెప్పవచ్చు. సహజంగా మిక్సెడ్ టాక్ వచ్చిన మూవీకి తర్వాత టాక్ మరింతగా జారిపోతుంది. కానీ ఈ సినిమాకు మాత్రం మెల్లగా పాజిటివ్ సైడ్ టర్న్ అవుతోంది. నెగిటివ్ టాక్ బలహీనపడిపోవడానికి కారణం.. దీని వెనక వేరే శక్తులు ఉన్నాయని జనాలు నమ్మేయడమే. పైగా గత కొన్నేళ్లుగా బ్యాడ్ రివ్యూలు.. యావరేజ్ టాక్ తో బ్లాక్ బస్టర్లు కొట్టేయడం ఈ స్టార్ హీరోకి బాగా అలవాటయిపోయింది లెండి.