Begin typing your search above and press return to search.

ఆ స్థానంలో వేరేవాళ్ళు ఉంటే సూసైడే: దిల్ రాజు

By:  Tupaki Desk   |   29 Dec 2022 8:00 AM IST
ఆ స్థానంలో వేరేవాళ్ళు ఉంటే సూసైడే: దిల్ రాజు
X
టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రముఖ నిర్మాతగా మంచి గుర్తింపు అందుకున్న దిల్ రాజు ఇటీవల కాలంలో అయితే కొన్ని వివాదాలతో హాట్ టాపిక్ గా మారుతున్నారు. ముఖ్యంగా వారసుడు సినిమాకు సంబంధించి థియేటర్ల విషయంలో ఆయన తెలుగు సినిమాలకు అన్యాయం చేస్తున్నారు అని వాదన కూడా వినిపిస్తోంది.

ఇక ఈ తరుణంలో దిల్ రాజు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఇండస్ట్రీలో ఎవరు బిజినెస్ వారిదే అని కంటెంట్ ఉన్నవాడు ఇక్కడ బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ చూస్తాడు అని చెప్పాడు.

అయితే ఈ సినిమా ప్రపంచంలో కొన్నిసార్లు అపజయాలు కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది అని వాటిని తట్టుకొని ముందుకు వెళ్లే సత్తా కూడా ఉండాలి అని చెప్పారు. ఒక తరుణంలో అయితే మహేష్ బాబు పవన్ కళ్యాణ్ సినిమాలతో దారుణంగా ఫైనాన్షియల్ డామేజ్ చూసినట్లుగా కూడా ఆయన చెప్పారు.

దిల్ రాజు 2017 లో మహేష్ బాబు మురగదాస్ కాంబినేషన్లో వచ్చిన స్పైడర్ సినిమాకులను నైజాం హక్కులను భారీ ధరకు కొనుగోలు చేశారు. అలాగే అదే ఏడాది అజ్ఞాతవాసి సినిమా నైజాం హక్కులను కూడా పోటీపడి మరి దక్కించుకున్నారు. ఆ సినిమా 2018 సంక్రాంతికి వచ్చిన విషయం తెలిసిందే. అయితే కొన్ని నెలల గ్యాప్ లోనే దిల్ రాజు ఆ రెండు సినిమాలతో చాలా దారుణమైన ఫైనాన్షియల్ డామేజ్ చూశాడు.

కానీ 2017 లో చిన్న సినిమాలతో ఆయన కొంత సేఫ్ అవ్వడమే కాకుండా వచ్చిన నష్టాలను కూడా తగ్గించుకున్నాడు. ఆ విషయాన్ని దిల్ రాజు ఇటీవల ఇంటర్వ్యూలో చెప్పాడు. 2017లో వరుస సక్సెస్ చూశాను కాబట్టి ఆ రెండు సినిమాలు దెబ్బ కొట్టినా అందుకే తట్టుకోగలిగాను. ఆ స్థానంలో మరొక డిస్ట్రిబ్యూటర్ నిర్మాత ఉండి ఉంటే సూసైడ్ చేసుకోవడం లేదంటే ఇండస్ట్రీ నుంచి పారిపోవడం లాంటివి చేసేవారు.. అని బిల్ రాజు చాలా స్ట్రైట్ గా సమాధానం ఇచ్చారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.