Begin typing your search above and press return to search.

మోసాలు చేస్తే క్వాలిటీ సంగతేంటి?

By:  Tupaki Desk   |   26 May 2018 7:11 AM GMT
మోసాలు చేస్తే క్వాలిటీ సంగతేంటి?
X
లాభం లేకుండా ఎవరూ వ్యాపారం చేయరు. ఫిలిం మేకింగ్ అయినా ఇంతే. సినిమాలతో పాటు ఇప్పుడు వెబ్ సిరీస్ కూడా వచ్చి చేరాయి. డిజిటల్ కంటెంట్ కు ఆదరణ పెరుగుతుండడంతో.. తెలుగులో కూడా వెబ్ సిరీస్ రూపొందించేందుకు ఇంటర్నేషనల్ కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి.

రీసెంట్ గా ఓ అంతర్జాతీయ కార్పొరేట్ కంపెనీ భాగస్వామ్యంతో ఓ తెలుగు నిర్మాత.. వెబ్ సిరీస్ లను నిర్మించేందుకు ఒప్పందం చేసుకున్నారు. ఇంతవరకూ వీటిలో ఒకటి కూడా రిలీజ్ కాలేదు కానీ.. ఆ నిర్మాత వ్యవహారమే ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతోంది. 10-ఎపిసోడ్స్ తో వెబ్ సిరీస్ నిర్మించేందుకు ఒప్పందం కుదుర్చుకోగా.. ఆ కార్పొరేట్ కంపెనీ నుంచి 9 కోట్లను తీసుకున్నారట. కానీ వాస్తవానికి కోటిన్నర నుంచి రెండు కోట్ల మధ్యలోనే ఈ వెబ్ సిరీస్ ను కంప్లీట్ చేసేశారని అంటున్నారు. దీంతో ఒక్క వెబ్ సిరీస్ కే ఆ నిర్మాతకు 7 కోట్లకు పైగా గిట్టుబాటు అయిందన్న మాట.

ప్రొడక్షన్ వాల్యూస్ లేకుండా వెబ్ సిరీస్ లను చుట్టేయడం ఆ కార్పొరేట్ కంపెనీకి బాగా మండుకొచ్చేలా చేసింది. తక్షణమే ఆడిట్ చేసిన ఖర్చుల లెక్కలను పంపాలంటూ ఆదేశాలు జారీ చేసిందట. ఒప్పందం ప్రకారం అయితే.. ఈ కార్పొరేట్ కంపెనీతో తెలుగు నిర్మాత మరో రెండు వెబ్ సిరీస్ లను కూడా చేయాల్సి ఉందట. క్వాలిటీ కంటెంట్ రావడం లేదని ఒకవైపు అందరూ వాపోతుంటే.. ఇలా ఇష్టానుసారం కార్పొరేట్ కంపెనీలను బెదిరించేయడం ఎంతవరకూ కరెక్టో.. నిర్మాతలే ఆలోచించుకోవాలి.