Begin typing your search above and press return to search.

ఆ నిర్మాత జాక్ పాట్ కొట్టేశాడటగా

By:  Tupaki Desk   |   21 Sep 2016 10:30 PM GMT
ఆ నిర్మాత జాక్ పాట్ కొట్టేశాడటగా
X
కన్నడ ఫిలిం ఇండస్ట్రీకి నిఖిల్ గౌడను హై లెవెల్ లో ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. దేవగౌడ మనవడు.. కుమారస్వామి కొడుకు కావడంతో.. నిఖిల్ ఇంట్రడక్షన్ టాప్ స్టార్ హీరో రేంజ్ లో జరుగుతోంది. తెలుగు తమిళ్ లో కూడా.. ఈ చిత్రాన్ని భారీగా రిలీజ్ చేసి.. మార్కెట్ క్రియేట్ చేసేందుకు జాగ్వార్ మేకర్స్ బాగానే ట్రై చేస్తున్నారు. ఇది ఓ టాలీవుడ్ ప్రొడ్యూసర్ కి భారీ లాభాలను మిగులుస్తోందని అంటున్నారు.

కేవలం జాగ్వార్ ని తెలుగులో భారీగా రిలీజ్ చేసినందుకు హెల్ప్ చేసినందుకే.. దాదాపు 5 కోట్ల రూపాయలు వెనకేసుకుంటున్నాడట ఓ టాలీవుడ్ ప్రొడ్యూసర్. జాగ్వార్ మేకర్స్ కి ఇక్కడి ఇండస్ట్రీపై పట్టు లేకపోవడంతో.. రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లపై గ్రిప్ ఉన్న ఓ ప్రొడ్యూసర్ ని అప్రోచ్ అయ్యి.. కేవలం తెలుగు రిలీజ్ కోసమే 5 కోట్లు వెచ్చిస్తున్నారని తెలుస్తోంది. దీనికి ప్రమోషన్స్ కోసం వెచ్చించే మొత్తం అదనం అంటున్నారు. అంటే కేవలం రిలీజ్ కి సాయం చేసినందుకే ఆ మొత్తం దక్కనుండగా.. ఇప్పటికే చేతిలో థియేటర్స్ ఉన్న ఆయనకు.. విడుదల విషయంలో థియేటర్స్ ఏర్పాటు చేయడం సమస్య కాబోదు.

ఇక జాగ్వార్ లో జగపతిబాబు.. రమ్యకృష్ణ.. బ్రహ్మానందంలు కూడా నటించడంతో.. తెలుగు ఆడియన్స్ కి ఈ మూవీ కనెక్ట్ కావడం అంత కష్టం కాకపోవచ్చనే అంచనాలు వినిపిస్తున్నాయి.