Begin typing your search above and press return to search.

డ్ర‌గ్స్‌కు బానిసైన బ‌డా ప్రొడ్యూస‌ర్ ఎవ‌రో?

By:  Tupaki Desk   |   3 July 2017 5:17 AM GMT
డ్ర‌గ్స్‌కు బానిసైన బ‌డా ప్రొడ్యూస‌ర్ ఎవ‌రో?
X
మ‌త్తు ప‌దార్థాలు సేవించి చిత్తుగా మ‌త్తులోకి చేరిపోవ‌డం ఇప్పుడు ఫ్యాష‌న్‌ గా మారిన‌ట్లుంది. ప్ర‌త్యేకించి పెద్ద న‌గ‌రాల్లో ఈ త‌ర‌హా క‌ల్చ‌ర్ నానాటికీ పెరిగిపోతోంది. భాగ్య‌న‌గ‌రిగా కీర్తిగాంచిన హైద‌రాబాదులో అయితే ఈ త‌ర‌హా క‌ల్చ‌ర్ మ‌రింత‌గా పెరిగింద‌నే చెప్పాలి. ఎందుకంటే... బ‌డా సాఫ్ట్‌వేర్ కంపెనీల‌తో పాటు సినీ రంగానికి చెందిన జ‌ల్సారాయుళ్లు అక్క‌డే తిష్ట వేసి ఉన్నారు కాబ‌ట్టి. ఎప్ప‌టిక‌ప్పుడు డ్ర‌గ్స్ విక్ర‌యిస్తున్న ముఠాలు పోలీసుల‌కు చిక్కుతున్నా... కొన్ని సంద‌ర్భాల్లో మాత్ర‌మే ప్ర‌ముఖుల పేర్లు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. అలా డ్ర‌గ్స్‌ తో సంబంధం ఉంద‌ని పేర్లు బ‌య‌ట‌కు వ‌చ్చిన ప్ర‌ముఖులు కూడా చిన్న చిన్న మూవీ ఆర్టిస్టుల‌తో పాటు ల‌క్ష‌ల్లో వేత‌నాలు తీసుకుంటున్న సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు, బ‌డా బాబుల పిల్ల‌ల పేర్లే ఉన్నాయి.

తాజాగా నిన్న ముగ్గురు స‌భ్యుల‌తో కూడిన డ్ర‌గ్స్ ముఠాను ఎక్సైజ్ ఎన్‌ ఫోర్స్ మెంట్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ముగ్గురు వ‌ద్ద ఉన్న వివ‌రాలను ప‌రిశీలించిన స‌ద‌రు విభాగం పోలీసు చీఫ్ అకున్ స‌బ‌ర్వాల్ ఆశ్చ‌ర్య‌పోయార‌ట‌. ఎందుకంటే... ఆ ముగ్గురు వ్య‌క్తుల నుంచి డ్ర‌గ్స్ కొంటున్న వారి జాబితాలో టాలీవుడ్‌ కు చెందిన ఓ బ‌డా నిర్మాత ఉన్నార‌ట‌. స‌ద‌రు నిర్మాత పేరు వెల్ల‌డించేందుకు ఇంకా స‌మయ‌ముంద‌ని చెప్పిన స‌బ‌ర్వాల్... పేరు మిన‌హా ఆ బ‌డా ప్రొడ్యూస‌ర్ డ్ర‌గ్స్ వాడుతున్న వైనం మొత్తాన్ని కూడా స‌వివ‌రంగా చెప్పేశారు. త‌న‌కు డ్ర‌గ్స్ కావాలంటూ... అరెస్టైన ముఠాలోని ఓ స‌భ్యుడి సెల్ ఫోన్‌ కు ఆ ప్రొడ్యూస‌ర్ మెసేజ్ పెట్టార‌ట‌. నిందితుల సెల్‌ ఫోన్‌ ల‌ను ప‌రిశీలించగా ఈ విష‌యం బ‌య‌ట‌ప‌డింద‌ని చెప్పిన స‌బ‌ర్వాల్‌... విచార‌ణ‌కు హాజ‌రు కావాలంటూ స‌ద‌రు నిర్మాత‌కు నోటీసులు కూడా జారీ చేసిన‌ట్లుగా చెప్పారు.

అంటే... స‌ద‌రు బడా ప్రొడ్యూస‌ర్ నేడు పోలీసుల ముందు విచార‌ణ‌కు హాజ‌రు కాక త‌ప్ప‌ద‌న్న మాట‌. నిందితుల సెల్ ఫోన్‌ కు ఆ నిర్మాత నుంచి వ‌చ్చిన మెసేజ్ వాస్త‌వ‌మైన‌దా? కాదా? అన్న విష‌యాన్ని తేల్చుకునేందుకు స‌ద‌రు నిర్మాత‌ను విచార‌ణ‌కు హాజ‌రుకావాల‌ని ఆదేశాలు జారీ చేశామ‌ని స‌బ‌ర్వాల్ చెప్పారు. ఇప్ప‌టికే నిందితుల ఫోన్ల‌లోని స‌ద‌రు మెసేజ్ ఏ నెంబ‌రు నుంచి వ‌చ్చింద‌న్న విష‌యాన్ని నిర్ధార‌ణ చేసుకున్న త‌ర్వాతే... స‌ద‌రు బ‌డా నిర్మాత‌కు నోటీసులు జారీ చేశార‌ని, ఈ వ్య‌వ‌హారంలో స‌ద‌రు నిర్మాత‌కు సంకెళ్లు ప‌డ‌టం ఖాయ‌మ‌న్న వాద‌న కూడా వినిపిస్తోంది. ఇప్పుడు ఆ నిర్మాత ఎవ‌ర‌న్న విష‌యంపైనే స‌ర్వ‌త్రా చ‌ర్చ జ‌రుగుతోంది. మ‌రికొన్ని గంట‌ల్లోనే స‌ద‌రు నిర్మాత‌కు సంబంధించిన పూర్తి వివ‌రాలు వెల్ల‌డి కానున్నాయి. మ‌రి ఆ పేరు బ‌య‌ట‌కు వ‌స్తే... టాలీవుడ్ ఏ మేర‌కు షేక్ అవుతుందో చూడాలి.




Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/