Begin typing your search above and press return to search.
రాజమౌళి పద్మానికి సన్మానం చేయరా?
By: Tupaki Desk | 13 April 2016 1:30 PM GMTపద్మ అవార్డులు.. పద్మశ్రీ - పద్మభూషణ్ - పద్మవిభూషణ్.. ఇలా ఏ పద్మ అవార్డు అందుకోవడం అయినా.. అదో ఘనత సాధించడమే. ఆయా రంగాల్లో విశేష సేవలు అందించిన వారికి దక్కే ఈ అవార్డలకు చాలా ప్రఖ్యాతి ఉంది. అందుకే రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్నా.. ఆ తర్వాత ఆయా రంగానికి చెందిన వారు, ప్రత్యేకంగా సన్మానించి తమ గౌరవాన్ని చాటుకుంటారు.
ఈసారి పద్మశ్రీ అవార్డు అందుకున్న ప్రియాంక చోప్రాను సన్మానించేందుకు ప్రత్యేకంగా కార్యక్రమం ఏర్పాటు చేశారు ఇండస్ట్రియలిస్ట్ కం పొలిటీషియన్ సుబ్బిరామిరెడ్డి. ఇందులో భాగంగా మోహన్ బాబు కూడా ప్రియాంక చోప్రాను సన్మానించారు. అయితే.. ఈ ఏడాది పద్మశ్రీ అవార్డు అందుకున్నవారిలో టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి కూడా ఉన్నాడు. మరి టాలీవుడ్ తరఫున రాజమౌళిని సత్కరించే కార్యక్రమంపై ఇప్పటివరకూ ఎవరూ నోరు మెదపడం లేదు.
టాలీవుడ్ ఖ్యాతిని ప్రపంచదేశాలకు చాటి చెప్పిన రాజమౌళి ఈ సన్మానికి పూర్తి అర్హుడు అన్న విషయంలో సందేహం అవసరం లేదు. అయితే.. ఇక్కడో విషయం చెప్పుకోవాలి. అప్పట్లో మెగాస్టార్ చిరంజీవికి పద్మభూషణ్ అవార్డ్ వచ్చినపుడు సన్మానించే సమయంలో వివాదం నెలకొంది. ఆ తర్వాత పద్మాలకు సన్మానాలపై టాలీవుడ్ వర్గాలు అంతగా ఆసక్తి చూపడం లేదనే టాక్ ఉంది.