Begin typing your search above and press return to search.
చిన్న సినిమాలతో సరిపెట్టుకోవాల్సిందేనా..?
By: Tupaki Desk | 25 Aug 2021 5:00 AM ISTకరోనా ప్రభావం నేపథ్యంలో పెద్ద సినిమాలు - పాన్ ఇండియా చిత్రాల విడుదలలు ఎప్పుడు ఉంటాయో చెప్పలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. 2021 జులై లో రిలీజ్ అవ్వాల్సిన 'కేజీయఫ్ 2' సినిమాని.. 2022 ఏప్రిల్ కు పోస్ట్ పోన్ చేసారంటేనే సిచ్యుయేషన్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. అలానే దసరా కానుకగా అక్టోబర్ 13న విడుదల చేస్తామని చెబుతూ వస్తున్న రాజమౌళి 'ఆర్ ఆర్ ఆర్' చిత్రాన్ని కూడా వాయిదా వేయనున్నారు. ట్రిపుల్ ఆర్ మేకర్స్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించనప్పటికీ.. ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేది వచ్చే ఏడాదే అని అర్థం అయిపోయింది. దీంతో RRR డేట్ కోసం పోటీ ఎక్కువైంది.
మెగాస్టార్ చిరంజీవి నటించిన 'ఆచార్య' చిత్రాన్ని విజయదశమి సందర్భంగా విడుదల చేస్తారని ఆ మధ్య వార్తలు వచ్చాయి. చిరు బర్త్ డే రోజు కూడా దీనిపై స్పష్టత రాకపోవడంతో ఈ సినిమా అక్టోబర్ లో వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. ఇలా పెద్ద సినిమాలు ఫెస్టివల్ సీజన్ కు దూరంగా ఉండటంతో.. బరిలో చిన్న మీడియం రేంజ్ సినిమాలు దిగడానికి రెడీ అవుతున్నాయి. క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తోన్న "కొండ పోలం" చిత్రాన్ని అక్టోబర్ లో విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. వైష్ణవ్ తేజ్ - రకుల్ ప్రీత్ సింగ్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం అక్టోబర్ 8న ప్రేక్షకుల ముందుకు రానుంది.
అలానే దిల్ రాజు ఫ్యామిలీ నుంచి వస్తున్న ఆశిష్ రెడ్డి డెబ్యూ మూవీ "రౌడీ బాయ్స్" దసరా పండుగ సందర్భంగా విడుదల చేయబోతున్నారని ప్రచారం జరుగుతోంది. అఖిల్ అక్కినేని హీరోగా నటించిన "మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్" చిత్రాన్ని కూడా దసరా బరిలో నిలపాలని మేకర్స్ ఆలోచిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఇంకొన్ని సినిమాలు రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేసే అవకాశం ఉంది. ఇకపోతే నందమూరి బాలకృష్ణ - బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కుతున్న ''అఖండ'' చిత్రాన్ని కూడా అదే సీజన్ లో విడుదల చేసే ఛాన్స్ ఉంది. ఒకవేళ "అఖండ" రేసులో ఉన్నట్లయితే ఇతర సినిమాలు వెనక్కి తగ్గే ఆలోచన చేయొచ్చు. మొత్తం మీద 2021 దసరా సీజన్ లో ఎక్కువ శాతం చిన్న మీడియం రేంజ్ సినిమాలే థియేటర్లలో సందడి చేయనున్నారు.