Begin typing your search above and press return to search.

అక్క‌డ మ‌న వాళ్ల ముందు త‌డ‌బ‌డ్డారు.. కానీ..!

By:  Tupaki Desk   |   23 Nov 2022 2:30 AM GMT
అక్క‌డ మ‌న వాళ్ల ముందు త‌డ‌బ‌డ్డారు.. కానీ..!
X
ప్రాంతీయ భాష‌లో ఎంత స్టార్ డ‌మ్ ని ద‌క్కించుకున్నా బాలీవుడ్ లోనూ జెండా పాతేయాల‌ని, అక్క‌డ కూడా త‌మ స‌త్తా చాటాల‌ని ప్ర‌య‌త్నాలు చేసిన ద‌క్షిణాది హీరోలు చాలా మందే వున్నారు. అందులో చాలా వ‌ర‌కు తొలి సినిమాతో ప‌రాజ‌యాల్ని ద‌క్కించుకున్న వాళ్లూ వున్నారు.. ఆ త‌రువాత విజ‌యాల్ని సొంతం చేసుకున్న హీరోలూ వున్నారు. టాలీవుడ్, కోలీవుడ్‌, మాలీవుడ్ హీరోలే అత్య‌ధికంగా బాలీవుడ్ లో త‌మ స‌త్తా చాటాల‌ని ప్ర‌య‌త్నించారు. ఇందులో ఎక్కువ‌గా పోటీప‌డింది మాత్రం మ‌న టాలీవుడ్ హీరోలే.

`లీడ‌ర్‌` సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన రానా.. ఆ త‌రువాత `ధ‌మ్ మారో ధ‌మ్‌` మూవీతో బాలీవుడ్ ని ఎట్రాక్ట్ చేయాల‌నుకున్నారు. అభిషేక్ బ‌చ్చ‌న్‌, బిపాషా బ‌సు కీల‌క పాత్ర‌ల్లో న‌టించిన ఈ మూవీ మిశ్ర‌మ ఫ‌లితాన్ని అందించి రానాని నిరాశ‌కు గురిచేసింది. అయితే ఆ త‌రువాత చేసిన డిపార్ట్ మెంట్‌, బేబీ, ఘాజీ, బాహుబ‌లి, హౌస్ ఫుల్ 4 మంచి విజ‌యాల్ని అందించి రానాకు అక్క‌డ మంచి పేరుతో పాటు పాపులారిటీని తెచ్చి పెట్టాయి.

ఇక రామ్ గోపాల్ వ‌ర్మ 2009 లో రూపొందించిన `అగ్యాంత్‌` సినిమాతో నితిన్ బాలీవుడ్ కు ప‌రిచ‌యం కావాల‌నుకున్నాడు. మిస్ట‌రీ అడ్వెంచ‌ర్ గా రూపొందిన ఈ మూవీ నితిన్ కెరీర్ లోనే అత్యంత డిజాస్ట‌ర్ అనిపించుకుంది. ఇదే మూవీని తెలుగులో `అడ‌వి` పేరుతో రిలీజ్ చేస్తే అదే ఫ‌లితం వ‌చ్చింది. దీంతో నితిన్ మ‌రో సారి బాలీవుడ్ ప్ర‌య‌త్నాలు చేయ‌లేదు. రామ్ చ‌ర‌ణ్ 2013లో అమితాబ్ బ‌చ్చ‌న్ `జంజీర్‌` రీమేక్ లో న‌టించాడు.

అపూర్వ ల‌ఖియా రూపొందించిన ఈ మూవీ తెలుగులో `తుఫాన్‌` గా విడుద‌లైంది. అక్క‌డా, ఇక్క‌డా సేమ్ రిజ‌ల్ట్ రావ‌డంతో మ‌రోసారి చ‌ర‌ణ్ బాలీవుడ్ సినిమా కోసం ప్ర‌య‌త్నించ‌లేదు. అయితే రీసెంట్ గా విడ‌దులైన పాన్ ఇండియా వండ‌ర్ `RRR`తో అక్క‌డ భారీ విజ‌యాన్ని ద‌క్కించుకోవ‌డంతో ఇప్ప‌డు బాలీఉడ్ డైరెక్ట‌ర్ల క‌న్ను చ‌ర‌ణ్ పై ప‌డుతోంది. కానీ చ‌ర‌ణ్ మాత్రం సై అన‌డం లేదు. ఇక త‌మిళ హీరో సూర్య `ర‌క్త చ‌రిత్ర 2` బాలీవుడ్ కు ప‌రిచ‌య‌మ‌య్యాడు కానీ హిట్ ని ద‌క్కించుకోలేక‌పోయాడు. ఇప్ప‌డు `ఆకాశ‌మే నీ హ‌ద్దురా` హిందీ రీమేక్ లో అతిథి పాత్ర‌లో న‌టిస్తూ హిందీ ప్రేక్ష‌కుల ముందుకు 12 ఏళ్ల త‌రువాత వ‌స్తున్నాడు.

ఇక `రావ‌ణ్‌` తో బాలీవుడ్ కు ప‌రిచ‌యం అయిన విక్ర‌మ్ అక్క‌డ హిట్ ని ద‌క్కించుకోలేక‌పోయాడు. అయితే డేవిడ్‌, పొన్నియిన్ సెల్వ‌న్ 1 లో స‌క్సెస్ అయ్యాడు. `కార‌వాన్‌` తో దుల్క‌ర్ బాలీవుడ్ కు వెళ్లాల‌ని చేసిన ప్ర‌య‌త్నం ఫ‌లించ‌లేదు. అయితే రీసెంట్ గా `ది జోయా ఫ్యాక్ట‌ర్, `చుప్‌`ల‌తో హిట్ లు అందుకున్నాడు. వీళ్లంద‌రి త‌రువాత నాగ‌చైత‌న్య `లాల్ సింగ్ చ‌డ్డా`తో.. విజ‌య్ దేవ‌ర‌కొండ `లైగ‌ర్‌`తో బాలీవుడ్ లో స‌క్సెస్ కావాల‌నుకున్నారు కానీ అది సాథ్యం కాలేదు. త్వ‌ర‌లో స‌క్సెస్ ని ద‌క్కించుకుని బాలీవుడ్ క‌ల‌ని నిజం చేసుకుంటార‌ని ఆశిద్దాం. ముందు త‌డ‌బ‌డిన మ‌న వాళ్లు ఆ త‌రువాత స‌క్సెస్ అయ్యారు. అదే పంథాలో నాగ‌చైత‌న్య‌, విజ‌య్ దేవ‌ర‌కొండ కూడా స‌క్సెస్ అవుతార‌ని ఆశిద్దాం.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.