Begin typing your search above and press return to search.

జూలైలో సంద‌డికి రెడీ అయిన‌వి ఇవే

By:  Tupaki Desk   |   14 Jun 2022 3:30 PM GMT
జూలైలో సంద‌డికి రెడీ అయిన‌వి ఇవే
X
క‌రోనా కారణంగా విడుద‌ల వాయిదాప‌డిన సినిమాల‌న్నీ ఇటీవ‌ల బ్యాక్ టు బ్యాక్ థియేట‌ర్ల‌లో సంద‌డి చేస్తున్న విష‌యం తెలిసిందే. స్మాల్ మూవీస్ నుంచి పాన్ ఇండియా మూవీస్ వ‌ర‌కు గ‌త కొన్ని నెల‌లుగా థియేట‌ర్ల‌లో సంద‌డి చేస్తూనే వున్నాయి. అయితే ఈ నెల 17 త‌రువాత బిగ్ అండ్ మీడియం రేంజ్ సినిమాల సంద‌డి రెండు వారాల పాటు అంటే జూలై వ‌ర‌కు క‌నిపించ‌దు. కార‌ణం జూన్ 17న రానా, సాయి ప‌ల్ల‌వి జంట‌గా న‌టించిన `విరాట‌ప‌ర్వం` విడుద‌ల‌వుతోంది. ఈ మూవీ త‌రువాత రెండు వారాల పాటు మ‌రో సినిమా థియేట‌ర్ల‌కు రావ‌డం లేదు.

జూలై 1 నుంచి మ‌ళ్లీ మీడియం రేంజి సినిమాల హ‌డావిడీ బాక్సాఫీస్ వ‌ద్ద మొద‌లు కాబోతోంది. ఇందులో ముందుగా హీరో గోపీచంద్ న‌టించిన `ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్` మూవీ థియేట‌ర్లలోకి రాబోతోంది. మారుతి డైరెక్ష‌న్ లో మారుతి మార్కు ఎంట‌ర్ టైన్ మెంట్‌, హీరో గోపీచంద్ మార్కు యాక్ష‌న్ అంశాల నేప‌థ్యంలో ఈ మూవీని తెర‌కెక్కించారు. గీతా ఆర్ట్స్ 2, యువీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్స్ పై బ‌న్నీవాసు ఈ మూవీని నిర్మించారు. రాశిఖ‌న్నా హీరోయిన్ గా న‌టించిన ఈ మూవీ హీరో గోపీచంద్ కు, ద‌ర్శ‌కుడు మారుతికి ఖ‌చ్చితంగా హిట్ కావాల్సిందే. ఇటీవ‌ల విడుద‌ల చేసిన ట్రైల‌ర్ సినిమాపై అంచ‌నాల్ని పెంచేసింది.

ఈ మూవీ త‌రువాత వారం గ్యాప్ లో వ‌స్తున్న చిత్రం `థాంక్యూ`. అక్కినేని నాగ‌చైత‌న్య హీరోగా న‌టించిన మూవీ ఇది. `మ‌నం` ఫేమ్ విక్ర‌మ్ కె. కుమార్ డైరెక్ట్ చేశారు. రాశిఖ‌న్నా, మాళ‌విక నాయ‌ర్‌, అవికా గోర్‌ హీరోయిన్ లు. దిల్ రాజు, శిరీష్ నిర్మించిన ఈ మూవీ జూలై 8న థియేట‌ర్ల‌లోకి రాబోతోంది. హాకీ ప్లేయ‌ర్ గా, సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు హార్డ్ కోర్ ఫ్యాన్ గా నాగ‌చైత‌న్య ఈ మూవీలో భిన్న‌మైన పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నారు. నానితో చేసిన `గ్యాంగ్ లీడ‌ర్` ఆశించిన ఫ‌లితాన్ని అందించ‌క‌పోవ‌డంతో ఈ మూవీపై విక్ర‌మ్ కుమార్ భారీ అంచ‌నాలు పెట్టుకున్నాడు.

నాగ‌చైత‌న్య‌కు కూడా ఈ మూవీ హిట్ చాలా అవ‌స‌రం. ఇక చై త‌ర‌వాత లైన్ లోకి దిగుతున్న హీరో ఉస్తాద్ రామ్‌. ఆయ‌న న‌టిస్తున్న భారీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ `ది వారియ‌ర్‌`. శ్రీ‌నివాస చిట్టూరి నిర్మిస్తున్న ఈ మూవీని త‌మిళ ద‌ర్శ‌కుడు ఎన్‌. లింగుసామి రూపొందిస్తున్నారు. కృతిశెట్టి, అక్ష‌రా గౌడ హీరోయిన్ లుగా న‌టిస్తున్నారు. ఆది పినిశెట్టి ప‌వ‌ర్ ఫుల్ విల‌న్ గా క‌నిపించ‌బోతున్నాడు. ఈ మూవీపై హీరో రామ్‌, ద‌ర్శ‌కుడు ఎన్‌. లింగుసామి భారీ అంచ‌నాలు పెట్టుకున్నారు.

ఈ మూవీ త‌రువాత నిఖిల్ న‌టించిన `కార్తికేయ 2` రాబోతోంది. `కార్తికేయ‌` సంచ‌ల‌న విజ‌యాన్ని సాధించిన నేప‌థ్యంలో దానికి సీక్వెల్ గా వ‌స్తున్న `కార్తికేయ 2` పై భారీ అంచ‌నాలే వున్నాయి. చందూ మొండేటి డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీని అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్‌, పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ సంయుక్తంగా నిర్మిస్తోంది. అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ ద్వారా బాలీవుడ్ ఫేమ‌స్ న‌టుడు అనుప‌మ్ ఖేర్ ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. ఈ మూవీని జూలై 22న విడుద‌ల చేస్తున్నారు. అయితే ఇది నిఖిల్ కెరీర్ లోనే తొలి సారి ఐదు భాష‌ల్లో పాన్ ఇండియా వైడ్ గా విడుద‌ల కాబోతోంది.