Begin typing your search above and press return to search.
డిసెంబర్ బరిలో ఏ హీరో దమ్మెంత?
By: Tupaki Desk | 18 Nov 2021 10:41 AM IST2021 ఎండ్ అవుతోంది. 2022లో అడుగుపెట్టేందుకు ఇంకెంతో సమయం లేదు. ఈ ఏడాది చివరిలో టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి మ్యాజిక్ చేయబోతోంది? సెకండ్ వేవ్ లోనూ కొన్ని హిట్లు ఆశల్ని పెంచాయి. ఇప్పుడు ఆ హోప్ ని మరింతగా పెంచేందుకు డిసెంబర్ సహకరిస్తుందా? అన్నదే ఇప్పుడు డిబేటబుల్ పాయింట్.
డిసెంబర్ నెల ఆరంభం నుంచి నటసింహ బాలకృష్ణ అభిమానులకు పండుగ ప్రారంభమైపోతుంది. బాలయ్య కథానాయకుడిగా నటిస్తోన్న యాక్షన్ ఎంటర్ టైనర్ `అఖండ` డిసెంబర్ 2న రిలీజ్ అవుతుంది. ఇప్పటికే ఈ సినిమా ప్రచార చిత్రాలు అంచనాల్ని అంతకంతకు పెంచేసాయి.
కొవిడ్ మొదలైన దగ్గర నుంచి అగ్ర హీరో సినిమా ఇప్పటివరకూ రిలీజ్ లేకపోవడంతో ఫ్యాన్స్ అవురావురు మంటూ వెయిట్ చేస్తున్నారు. సరిగ్గా ఇదే పాయింట్ ని `అఖండ` ఎన్ క్యాష్ చేసుకునే అవకాశం కనిపిస్తోంది. పక్కా బోయపాటి శైలి సినిమా కాబట్టి కంటెంట్? ఎలా ఉండనుందో ప్రేక్షకులు ముందే ఓ అంచనాకి వచ్చి థియేటర్ కి వెళ్తారు కాబట్టి సినిమాకి అది పాజిటివ్ వైబ్ గా చెప్పొచ్చు.
గతంలో ఇద్దరి కాంబినేషన్ లో తెరకెక్కిన `సింహ`..`లెజెండ్` కూడా భారీ విజయాలే నమోదు చేసాయి కాబట్టి అఖండపైనా అలాంటి అంచనాలే ఉన్నాయి. ఆ తర్వాత పది రోజుల గ్యాప్ లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియా చిత్రం `పుష్ప ది రైజ్` తో డిసెంబర్ 17న భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.
ఈ సినిమా ఆడియో ఇప్పటికే పెద్ద సక్సెస్ అయింది. సుకుమార్ మేకింగ్ కాబట్టి తిరుగులేని చిత్రంగానే అంచనాలున్నాయి. ఈ రెండు చిత్రాలు కొవిడ్ తగ్గిన తర్వాత రిలీజ్ అవుతున్న భారీ చిత్రాలుగా చెప్పొచ్చు. ఇక మీడియం రేంజు హీరోలు నేచురల్ స్టార్ నాని..మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ లు ఈసారి కాన్ఫిడెంట్ గా బరిలో దిగుతున్నారు.
నాని నటిస్తోన్న `శ్యామ్ సింగరాయ్`.. వరుణ్ తేజ్ నటిస్తోన్న `గని` చిత్రాలు ఒకే రోజున డిసెంబర్ 24న రిలీజ్ అవుతున్నాయి. ఈ రెండు చిత్రాలపైనా మంచి అంచనాలున్నాయి. వీటితో పాటు కొన్ని మీడియం బడ్జెట్ చిత్రాలు..చిన్న చిత్రాలు రిలీజ్ అవుతున్నాయి.
దీంతో ఈ డిసెంబర్ అంతా థియేటర్లు సినిమాలతో కళకళలాడం ఖాయం. అయితే ఈ నాలుగు చిత్రాలు కూడా టిక్కెట్ ధరల పెంపుతో సంబంధం లేకుండా పాత ధరల ప్రాతిపదికనే రిలీజ్ కాబోతున్నాయి. ఇన్నాళ్లు టిక్కెట్ ధరలు పెంచుతారని వెయిట్ చేసినా ఫలితం లేదు. దీంతో పెంపుతో సంబంధం లేకుండా బరిలోకి దిగుతున్నాయి. మరి ఏ హీరో దమ్మెంతో? తేలాలంటే రిలీజ్ వరకూ వెయిట్ చేయాల్సిందే. 2022లో అడుగుపెట్టే ముందే సంచలనాలు నమోదవుతాయనే ఆశిస్తున్నారు. అన్ని రకాలా మేకర్స్ కి టైమ్ కలిసొస్తుందనే ఆకాంక్షిద్దాం.