Begin typing your search above and press return to search.
పీక్స్ కి చేరిన వ్యూస్ గోల
By: Tupaki Desk | 20 May 2022 2:30 PM GMTటాలీవుడ్ సినిమా ట్రెండ్ ని బట్టి మారుతోంది. సరికొత్త ట్రెండ్ లని క్రియేట్ చేస్తూ సంచలనాలు సృష్టిస్తోంది. మన సినిమాలు పాన్ ఇండియా వైడ్ గా రికార్డులు తిరగరాస్తున్న నేపథ్యంలో ప్రతీ సినిమా అటెన్షన్ క్రియేట్ చేయాలని చూస్తోంది. ఇందుకు సోషల్ మీడియా, యూట్యూబ్ లని ప్రధాన అస్త్రాలుగా ఎంచుకుంటోంది. ఇంతకు ముందు సినిమా హిట్ అంటే బాక్సాఫీస్ లెక్కలు, సెంటర్ లని చూపించే వారు కానీ ట్రెండు మారింది. ఇప్పడు వ్యూస్ ఎన్ని మిలియన్స్ సాధిస్తే అంత రికార్డ్ అనే ట్రెండ్ మొదలైంది. దీంతో టాలీవుడ్ లో ఇప్పడు వ్యూస్ గోల పీక్స్ కి చేరింది.
ఫ్యాన్స్ కూడా ఇదే పాలో అవుతున్నారు. మేకర్స్ కి భిన్నంగా ప్రచారం చేస్తూ నచ్చిన క్రేజీ హీరో టీజర్, ట్రైలర్, వీడియో సాంగ్ లకు మిలియన్ ల కొద్దీ వ్యూస్ రావాలని ప్రయత్నాలు చేస్తున్నారు. టీజర్, మోషన్ పోస్టర్, ట్రైలర్ రిలీజ్ అయితే 24 గంటల్లో ఎన్ని వ్యూస్ సాధించింది?.. ఏ హీరో రికార్డుని బ్రేక్ చేసింది. ఏ రికార్డుని కొత్తగా క్రియేట్ చేయబోతోంది? అన్నవి ఇప్పడు ప్రధానంగా మారాయి. దీన్ని బట్టే హీరో సినిమాపై ఏ రేంజ్ క్రేజ్ వుందో కూడా చెప్పేస్తున్నారు.
ఇక ఇంతటితో ఆగక ప్రొడక్షన్ హౌస్ లు హీరోలు, వారి ఫ్యాన్స్ కోసం తాము విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్, థియేట్రికల్ ట్రైలర్ ఏ స్థాయిలో వ్యూస్ ని రాబట్టాయి. గంటల్లోనే ఎలాంటి రికార్డుల్ని సొంతం చేసుకున్నాయి. వంటి లెక్కల్ని గంట గంటకు అందిస్తూ ప్రత్యేక పోస్టర్లని డిజైన్ చేయిస్తూ ప్రచారం చేస్తున్నారు. దీంతో ఈ ట్రెండ్ ఇప్పడు మరింత వైరల్ అవుతూ వస్తోంది. ఇక ఈ రికార్డు వ్యూస్ ల పోటీలో దొంగ లెక్కలు కూడా ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి.
రానీ వ్యూస్ ని వచ్చినట్టుగా.. ఇండియా వైడ్ గా టాప్ లో ట్రెండ్ అయినట్టుగా కూడా చూపిస్తూ సినిమా ప్రచారం కోసం నానా జిమ్మిక్కులు చేస్తున్నారు. అంతే కాకుండా ఇందు కోసం కూడా ప్రొడ్యూసర్స్ భారీగానే ఖర్చు చేస్తున్నారు. ఇందు కోసం ప్రత్యేకంగా టీమ్ లని ఏర్పాటు చేసుకుని తమ స్టార్ సినిమా సోషల్ మీడియా, యూట్యూబ్ లో వైరల్ అయ్యేలా ప్లాన్ లు వేస్తున్నారు.
ఇక స్టార్ సినిమా ఎంత తక్కువ గంటల్లో ఎంత ఎక్కువ వ్యూస్ సాధిస్తే ప్రేక్షకుల్లో అంత క్రేజ్ ఏర్పడుతుందని ప్రచారం జరుగుతుండటంతో నిర్మాతలు ఈ విషయంలో భారీగానే ఖర్చు చేస్తున్నారు. చాలా వరకు టెక్నికల్ గా ఏ స్థాయిలో జిమ్మిక్కులు చేయవచ్చో అవన్నీ డబ్బు ఖర్చుచేసి మరీ చేసేస్తున్నారు. మిలియన్ వ్యూస్ కి లక్షల్లో ఖర్చు చేస్తున్నారట. ఈ ట్రెండ్ ఇప్పడు పీక్స్ చేరి ఏ రికార్డ్ అసలో ఏ రికార్డ్ ఫేకో తెలియని స్థాయికి తాజా వ్యూస్ ట్రెండ్ చేరిపోవడం గమనార్హం.