Begin typing your search above and press return to search.
పబ్లిక్ ఒపీనియన్: టాలీవుడ్ మోస్ట్ హ్యాండ్సమ్ హీరో..?
By: Tupaki Desk | 28 July 2021 8:00 AM ISTపాన్ ఇండియా సినిమాలతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంటున్న టాలీవుడ్ హీరోలు.. ఇప్పుడు ఇండియన్ బాక్సాఫీస్ ని శాసించే స్థాయికి చేరుకుంటున్నారు. స్టార్డమ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ లో బాలీవుడ్ స్టార్స్ కు ఏమాత్రం తీసిపోమని నిరూపిస్తున్నారు. యాక్టింగ్ పరంగానే కాకుండా అందంలో కూడా తెలుగు హీరోలు క్రేజ్ ఏర్పరచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ లో మోస్ట్ హ్యాండ్సమ్ హీరో ఎవరు అనే దానిపై పబ్లిక్ ఒపీనియన్ తెలుసుకోడానికి 'తుపాకీ డాట్ కామ్' ఓ పోల్ నిర్వహించింది. ఇందులో మహేష్ బాబు - ప్రభాస్ - విజయ్ దేవరకొండ పేర్లను ఉంచడం జరిగింది. ఈ పోల్ ప్రకారం టాలీవుడ్ మోస్ట్ హ్యాండ్సమ్ హీరో ఎవరో ఇప్పుడు చూద్దాం!
సూపర్ స్టార్ మహేష్ బాబు కు మించిన అందగాడు టాలీవుడ్ లో లేరని ఆడియన్స్ ఈ పోల్ ద్వారా చెబుతున్నారు. మొత్తం పోలైన ఓట్లలో 57.28% మంది మోస్ట్ హ్యాండ్సమ్ హీరో మహేష్ అంటూ.. ఆయన్ని ఫస్ట్ ప్లేస్ లో నిలిపారు. నటశేఖర కృష్ణ వారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన మహేష్.. హాలీవుడ్ హీరోని తలదన్నే అందగాడు అనిపించుకున్నాడు. మరి కొన్ని రోజుల్లో 46 ఏట ఎంటర్ అవుతున్న మహేష్.. లుక్స్ పరంగా తన కొడుకు గౌతమ్ కు అన్న అనుకునే విధంగా కనిపిస్తుంటాడు. అందుకే ఈ పోల్ లో ఎక్కువ శాతం అతన్నే అందగాడిగా తేల్చేశారు.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇందులో 19.61% ఓట్లతో రెండో స్థానంలో ఉన్నారు. 'బాహుబలి' సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్.. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అయిన డార్లింగ్.. హ్యాండ్సమ్ లుక్స్ తో అందరినీ ఆకట్టుకుంటున్నారు. అందుకే ఇటీవల విడుదలైన 'మోస్ట్ హ్యాండ్సమ్ ఏషియన్ మెన్-2021' జాబితాలో చోటు దక్కించుకున్నాడు. పది మందితో కూడిన ఈ లిస్ట్ లో ప్రభాస్ ఫస్ట్ ప్లేస్ లో నిలిచాడు. అయితే తెలుగు ఆడియన్స్ మాత్రం ప్రభాస్ ను మించిన అందగాడు మహేష్ అని ఈ పోల్ ద్వారా చెబుతున్నారు.
సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ టాలీవుడ్ మోస్ట్ హ్యాండ్సమ్ హీరో అని 15.31% మంది అంటున్నారు. 'పెళ్లి చూపులు' సినిమాతో పూర్తి స్థాయి హీరోగా మారిన వీడీ.. తన క్రేజ్ పెంచుకుంటూ వెళ్తున్నాడు. 'అర్జున్ రెడ్డి' తో యూత్ లో ఫాలోయింగ్ తెచ్చుకున్న విజయ్.. నేషనల్ వైడ్ క్రేజ్ సాధించే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇటీవల హైదరాబాద్ టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మ్యాన్ టైటిల్ ను వరుసగా మూడోసారి సాధించి సెన్సేషన్ క్రియేట్ చేసాడు. ఇప్పుడు పాన్ ఇండియా సినిమాతో తన సత్తా ఏంటో చూపించాలని ఎదురు చూస్తున్నాడు. ఇక ఈ పోల్ లో 7.81% మంది మాత్రం ఈ ముగ్గురిలో ఎవరు హ్యాండ్సమ్ అనేది చెప్పలేమని అంటున్నారు.