Begin typing your search above and press return to search.

టాలీవుడ్ మోస్ట్‌ బ్యూటీఫుల్‌ కపుల్ @ 17

By:  Tupaki Desk   |   10 Feb 2022 7:42 AM GMT
టాలీవుడ్ మోస్ట్‌ బ్యూటీఫుల్‌ కపుల్ @ 17
X
టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు మరియు నమ్రతల జోడీ గురించి ఎంత చెప్పినా తక్కువే. వీరిద్దరు వంశీ సినిమా షూటింగ్ సమయంలో కలిశారు. ఆ సమయంలోనే ఇద్దరి మద్య ప్రేమ మొదలైంది. దాదాపు అయిదు సంవత్సరాల పాటు వీరిద్దరు ప్రేమలో ఉన్నారు. వీరి ప్రేమకు మొదట కుటుంబ సభ్యులు నో చెప్పారు అనే వార్తలు వచ్చాయి. కాని చివరకు వీరి ప్రేమకు ఇరు కుటుంబ సభ్యుల నుండి గ్రీన్ సిగ్నల్‌ రావడంతో ఇద్దరు కూడా దంపతులుగా మారారు.

వీరి వివాహం రహస్యంగా జరిగిందని.. హడావుడిగా జరిగిందంటూ అప్పట్లో మీడియాలో వార్తలు వచ్చాయి. ఇప్పట్లా మీడియా అప్పుడు ఎక్కువ లేకపోవడంతో మహేష్‌ బాబు పెళ్లి విషయం ఎక్కువ వైరల్‌ అవ్వలేదు. పెళ్లి ఎలా జరిగినా వీరి జంట టాలీవుడ్‌ లోనే కాకుండా ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. మహేష్ బాబు ప్రతి విషయంలో నమ్రత జాగ్రత్తలు తీసుకుంటారు.

తన కెరీర్‌ ను పక్కన పెట్టి పిల్లలు మరియు భర్త విషయాలపై శ్రద చూపిస్తూ ఒక పక్కా గృహిణిగా నమ్రత వ్యవహరిస్తున్నారు. పిల్లలు పెద్ద వారు అయిన తర్వాత వ్యాపారాల్లో నమ్రత బిజీ అయ్యారు. మహేష్ బాబు పేరుతో నిర్వహించే పలు వ్యాపారాలను నమ్రత చూసుకుంటారు. మహేష్‌ బాబు హీరోగా మరియు ఒక వ్యాపారవేత్తగా సక్సెస్ అవ్వడంలో నమ్రత భాగస్వామ్యం ఖచ్చితంగా ఉంటుంది అనడంలో సందేహం లేదు.

మహేష్‌ బాబు కు సూపర్‌ స్టార్‌ ఇమేజ్ వచ్చింది నమ్రతతో పెళ్లి తర్వాతే అనే విషయం తెల్సిందే. ఇక మహేష్‌ బాబు సినిమాల ఎంపిక విషయం నుండి మొదలుకుని సినిమాలో ఆయన అప్పియరెన్స్ వరకు కూడా నమ్రత ఇన్వాల్వ్‌ మెంట్‌ ఉంటుందనే టాక్‌ ఉంది.

బాలీవుడ్‌ లో ఎన్నో సినిమాలు చేయడంతో పాటు టాలీవుడ్‌ లో కూడా సినిమాల్లో నటించిన నమ్రత పెళ్లి తర్వాత సినిమాలకు గుడ్‌ బై చెప్పారు. పెళ్లి అయిన తర్వాత కూడా ఆఫర్లు వచ్చినా కూడా ఆమె తిరష్కరించారు. సమయం మొత్తం కూడా కుటుంబంకు కేటాయించారు. షూటింగ్‌ లతో మహేష్‌ బిజీగా ఉండటంతో నమ్రత కుటుంబ వ్యవహారాలు చూసుకుంటారు. ఎన్న చారిటీ కార్యక్రమాలను మహేష్‌ బాబు పేరుతో ఆమె నిర్వహిస్తున్నారు.

మహేష్‌ బాబు వేలాది చిన్నారుల గుండెలకు జీవం పోశారు. ఆ పనిలో కీలక పాత్ర నమ్రతదే అంటారు. ఆమె స్వయంగా ఆ వ్యవహారాలు చూసుకుంటారని తెలుస్తోంది. ఈ టాలీవుడ్ మోస్ట్‌ బ్యూటీఫుల్ అండ్ సక్సెస్ ఫుల్‌ కపుల్‌ ఏకం అయ్యి నేటికి 17 సంవత్సరాలు అయ్యింది. ఈ సందర్బంగా వారికి సోషల్‌ మీడియాలో ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మా తరపున కూడా మహేష్‌ నమ్రతలకు పెళ్లి రోజు శుభాకాంక్షలు.