Begin typing your search above and press return to search.

పెళ్ల‌యిన హీరో ఎఫైర్.. వైఫ్ ని హ‌ర్ట్ చేయ‌లేదా?

By:  Tupaki Desk   |   15 April 2020 10:30 PM IST
పెళ్ల‌యిన హీరో ఎఫైర్.. వైఫ్ ని హ‌ర్ట్ చేయ‌లేదా?
X
అప్ప‌టికే పెళ్ల‌యిన స్టార్ హీరో వేరొక అందాల క‌థానాయిక‌తో ఎఫైర్ సాగిస్తే ఆ వైఫ్ ప‌రిస్థితేంటి? మాన‌సికంగా కుంగుబాటుకు గుర‌వ్వ‌‌దా? పైగా పెద్ద ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్.. దాంతో పాటే స‌ద‌రు హీరోగారు నేరుగా ఆ ముంబై హీరోయిన్ ని త‌న ఇంట్లోనే ఆశ్ర‌యం ఇవ్వ‌‌డం క‌ల‌తల‌‌కు దారి తీయ‌దా? అంటే.. అప్ప‌ట్లో స‌ద‌రు హీరోగారి రిలేష‌న్ షిప్స్ గురించి వ‌చ్చిన రూమ‌ర్లు ఆ డిగ్నిఫైడ్ భార్యామ‌ణిని ఎంతో క‌ల‌త‌కు గురి చేసి ఉంటాయ‌నేది అభిమానుల ఫీలింగ్.

ఓ బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమాలో తొలుత అవ‌కాశం ఇచ్చి.. అటుపై వ‌రుస‌గా త‌న స‌ర‌స‌న న‌టించే ఛాన్సిచ్చిన ఆ హీరోగారు.. ముంబై నుంచి ఆవిడ రాగానే నేరుగా త‌న ఇంట్లోనే ఆశ్ర‌యం ఇచ్చేవారు. ఆ హీరోయిన్ అటు హిందీ ప‌రిశ్ర‌మ‌లో బిజీ. పైగా ఇక్క‌డ హైద‌రాబాద్ ప‌రిశ్ర‌మ‌లో వ‌రుస ఛాన్సులు. బ‌య‌ట హోట‌ల్లో ఆశ్ర‌యం ఇవ్వాల్సి వ‌స్తే హీరోకి నామోషీ. ఆ క్ర‌మంలోనే త‌మ ఇంట్లోనే హీరోయిన్ కి వ‌స‌తి క‌ల్పించ‌డంతో ఆ భార్యామ‌ణి స‌న్నివేశం ఎలా ఉంటుందో ఊహించ‌న‌ల‌వి కానిదే. ఓవైపు జ‌నం గోల గోల‌. ఫ‌లానా హీరోయిన్ ని ఇంట్లో పెట్టుకుని ఆయ‌న గారు ఈ ప‌రాచికాలేమిటి? అంటూ సూటి పోటి మాట‌లు ఎదుర్కోవాల్సి వ‌చ్చేది. అస‌లు ఈ ఎఫైర్ ఏమిటో! అంటూ పెద‌వి విరిచేసేవారు. ఏళ్ల‌కు ఏళ్లు ఇలాంటి ప్ర‌చారం సాగ‌డంతో అది కాస్తా ట్రెండింగ్ టాపిక్ అయ్యింది.

ఇక ఇన్ని ఎపిసోడ్లు జ‌రుగుతున్నా.. స‌ద‌రు భార్యామ‌ణి నిగ్ర‌హం అంద‌రినీ విస్మ‌య‌ప‌రిచేది. ``అవును ఆమె మా ఇంట్లోనే ఉండేది. మేమే వ‌స‌తి క‌ల్పించే వాళ్లం. ముంబై నుంచి వ‌స్తే త‌న‌కు గృహ‌వ‌స‌తి ఇవ్వాలి క‌దా!`` అంటూ న‌వ్వేసేది ఇంట‌ర్వ్యూల్లో. అంతేనా.. ఆయ‌న‌తో ఎఫైర్ మ్యాట‌ర్ ని త‌ను ఏనాడూ నామ‌మాత్రంగా అయినా త‌న భ‌ర్త కం హీరో వ‌ద్ద ప్ర‌స్థావించేవారు కాద‌ట‌. అస‌లే త‌మ‌ది ప్రేమ వివాహం. ఓ బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీలో న‌టించేప్పుడు కుదిరిన స్నేహం.. అటుపై ప్రేమ‌కు దారి తీసి వివాహం చేసుకున్నారు. ఆ క్ర‌మంలోనే ముంబైలో సెటిలైన హైద‌రాబాదీ హాటీతో హీరోగారి ఎఫైర్ వార్త‌లు గుప్పు మ‌న్నాయి. అయితే దానిపై స‌ద‌రు వైఫ్ ప్ర‌తిసారీ మీడియా ముఖంగా క‌వ‌ర్ చేయాల్సిన స‌న్నివేశం ఉండేది. ఇలాంటి క‌ష్టం ప‌గోడికైనా రాకూడ‌దు సుమీ!