Begin typing your search above and press return to search.

ఈసారి హారర్ సినిమాతో భయపెడతానంటున్న టాలీవుడ్ జయమ్మ..!

By:  Tupaki Desk   |   5 March 2021 8:30 AM GMT
ఈసారి హారర్ సినిమాతో భయపెడతానంటున్న టాలీవుడ్ జయమ్మ..!
X
కోలీవుడ్ హీరోయిన్ వరలక్ష్మీ శరత్ కుమార్ ఈ ఏడాది ప్రారంభంలో 'క్రాక్' సినిమాలో 'జయమ్మ'గా నటించి తెలుగు ప్రేక్షకుల మన్ననలు అందుకుంది. ఆ తర్వాత వచ్చిన 'నాంది' సినిమాలో హీరోతో సమానమైన క్యారెక్ట‌ర్ లో నటించి చిత్ర విజయంలో ముఖ్య పాత్ర పోషించింది. ఓవైపు నెగిటివ్ రోల్స్ మరోవైపు పాజిటివ్ రోల్స్ చేస్తూ ఆడియన్స్ ని మెప్పించిన వరలక్ష్మి.. ఇప్పుడు టాలీవుడ్ లో క్రేజీ ఆఫర్స్ దక్కించుకుంటోంది. ఈ క్రమంలో నేడు వరలక్ష్మి పుట్టినరోజు సందర్భంగా మరో తెలుగు సినిమాని అధికారికంగా ప్రకటించారు.

వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధాన పాత్రలో రచయిత డార్లింగ్ స్వామి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. ఇదొక హారర్ ఎంటర్టైనర్ అని తెలుస్తోంది. వరలక్ష్మికి బర్త్ డే విషెస్ తెలియజేస్తూ చిత్ర యూనిట్ అనౌన్సమెంట్ పోస్టర్ ని విడుదల చేసారు. ఇందులో ఓ హాంటెడ్ హౌస్ కనిపిస్తుండగా.. వరలక్ష్మీ తీక్షణంగా చూస్తోంది. ప్రముఖ నిర్మాత కోనేరు సత్యనారాయణ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. హావీష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం.1 గా రూపొందనున్న ఈ చిత్రాన్ని కోనేరు కాంచన నిర్మించనున్నారు. మురళీ కృష్ణ కొడాలి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించనున్నారు. గాంధీ నడికుడికార్ ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన ఇతర వివరాలు త్వరలోనే వెల్లడికానున్నాయి.