Begin typing your search above and press return to search.
కొవిడ్ 19 మార్గదర్శకాలతో టాప్ 10 ట్రబుల్స్
By: Tupaki Desk | 12 Jun 2020 12:22 PM ISTషూటింగులకు ప్రభుత్వాలు అనుమతించాయి సరే.. కొవిడ్ 19 మార్గదర్శకాలతో ఎలాంటి టెన్షన్స్ లేవా? అంటే .. అబ్బో నిర్మాతకు బొప్పి కట్టే టెన్షన్స్ అన్నీ ఇన్నీ కావు అని విశ్లేషిస్తున్నారు. ఏమిటా టెన్షన్స్ అన్నది విశ్లేషిస్తే...
సెట్స్ కెళ్లే కాస్ట్ అండ్ క్రూకి తొలిగా కరోనా టెస్ట్ లు చేయంచాలి. ఒక్కొక్కరికి రూ. 4500 ఖర్చు చేసి నిర్మాత చేతి చమురు వదిలించుకోవాలి. సొంతంగా టెస్ట్ చేయించుకుని షూటింగ్ కు రమ్మంటే వచ్చేదెవరు? అంత భరించే సీన్ సగటు లైట్ మ్యాన్.. మేకప్ బోయ్ కి ఉంటుందా?
బాహుబలి తరహా పాన్ ఇండియా చిత్రాలకు 50 మందితోనే షూట్ కష్టం. జూనియర్ ఆర్టిస్టులు భారీగా ఉండాల్సిందే. ప్రతీ ఫ్రేమ్ లోనూ వందలాది మంది జూనియర్ ఆర్టిస్టులని తెచ్చిపెట్టడం కష్టం. ఇప్పుడు అలాంటి సీన్ లేనేలేదు. పైగా జూనియర్లు అందరికీ రూ.4,500 ఖర్చు చేసి కరోనా టెస్టులు సాధ్యమయ్యే పనేనా? దానికంటే గ్రాఫిక్స్ లో మ్యానేజ్ చేయడమే బెటర్.
ఇక కరోనా టెస్టులు చేసినా.. షూటింగ్ జరిగినన్ని రోజులూ వారిని బయటకు వెళ్లనీయకుండా చూడగలగాలి. దాదాపు ఫారిన్ షూటింగ్ షెడ్యూల్ లాగ..ఎవ్వరూ ఇళ్లకు వెళ్లకూడదు. వెళితే ఎక్కడైనా వ్యాధిని అంటించుకుని సెట్స్ కి వస్తే అంతే సంగతి.
ఆన్ లొకేషన్ నుంచి ఎవరు బయటికి వెళ్లినా వారిని సపరేట్ గా ఉంచడం కష్టమైన విషయం.. కానీ వెళ్లి తీరాల్సిన సన్నివేశం ఉంటుంది. ప్రొడక్షన్స్ వాళ్లు.. ఆర్ట్ డిపార్ట్ మెంట్.. మస్ట్. క్యారేజీలు.. తిండి పదార్థాలు బయటి నుంచే తెస్తుంటారు. కానీ స్ట్రిక్టుగా సెట్ లోనే ఇక వండాలి. బయటి నుంచి నిషేధించాలి.
షూటింగ్ లొకేషన్స్ పూర్తిగా శానిటైజ్ చేయించాలి. షూటింగ్ పూర్తైన తర్వాత ఆ లొకేషన్ ని శానిటైజ్ చేయాలి. అందరూ శానిటైజర్స్ విడిగా వాడాలి. మాస్కులు అందరికీ ఇవ్వాలి. ప్రతిదీ నిర్మాతకే తడిసిమోపెడవుతుంది.
లొకేషన్లకు చుట్టాలు.. మిత్రుల ప్రవేశం రద్దు చేయాలి. విదేశీ అనుమతుల్లేవు. రెడ్ జోన్లలో పర్మిషన్ లేదు. అలాంటప్పుడు ఉన్న లొకేషన్లు.. స్థానికంగానే చూసుకోవాల్సిన పరిస్థితి.
షూట్ పూర్తయ్యాక వెంటనే జనాల్లోకి వెళ్లిపోకూడదు. షూట్ పూర్తయ్యినా కొంతకాలం దాకా ఎవరితో కలవకూడదు. సెట్ లో సెల్ఫ్ క్వారెంటైన్ రూమ్ ఏర్పాటు చేసుకోవాలి. వీళ్లందరికీ ఓ డాక్టర్.. సైకాలజిస్ట్ ఎప్పుడూ సెట్ లో అందుబాటులో ఉండాలి. కరోనా లక్షణాలు వెంటనే పసిగట్టగలగాలి. ఆన్ లొకేషన్ తిండి సహా ప్రతిదీ జాగ్రత్త వహించాలి.
ఎవరి కుర్చీ వారిదే. ఎవరి బెంచీ వారిదే. ఎవరి కంచం వారిదే.. పేర్లు రాసుకుని పెట్టుకోవాలి తప్పదు. బట్టలు కూడా ఎవరూ ముట్టుకోకూడదు అనవసరంగా. ఆన్ లొకేషన్ బట్టలు ఉతికించుకోవాల్సిందే. ప్రతీ నాలుగు గంటలకు కాస్ట్యూమ్స్ ఛేంజ్ చేయాలి.
అంబులెన్స్ షూటింగ్ స్పాట్ లో తప్పనిసరి. సెట్ లో ఎక్కడా గుట్కా- పాన్సి -సిగరెట్ వంటివి పెట్టుకోకుండా చూడాలి. మాగ్జిమం ఉమ్మి వేయకూడదు. ఎవరి మేకప్ వారికి కష్టం .. పౌడర్ వేయడమే తెలియని వాళ్లు సొంత మేకప్ కష్టమే. దీనివల్ల షూట్ కి ఇబ్బంది.
ఇలాంటివి ఇంకా ఎన్నో టెన్షన్స్ ఉన్నాయి. వాటన్నిటి విషయంలో ఎంతో జాగ్రత్త వహించాలి. ప్రతి నిమిషం కేర్ ఇంపార్టెంట్. ఇదంతా నిర్మాతకు బొప్పి కట్టించే వ్యవహారమే.