Begin typing your search above and press return to search.

ఫుల్ జోష్ లో టాలీవుడ్.. సెట్స్ లోకి అగ్ర హీరోల ఎంట్రీ

By:  Tupaki Desk   |   8 Nov 2020 9:30 AM IST
ఫుల్ జోష్ లో టాలీవుడ్.. సెట్స్ లోకి అగ్ర హీరోల ఎంట్రీ
X
కరోనా రాకతో దేశంలోని అన్ని సినిమా ఇండస్ట్రీలు కకావికలం అయ్యాయి. అర్ధాంతరంగా షూటింగ్ లు ఆగిపోవడంతో నిర్మాతలు నష్టాలపాలయ్యారు. చిన్నచిన్న నటులకు, కార్మికులకు చేతిలో పని లేకపోవడంతో చాలా మంది రోడ్డున పడ్డారు. కరోనా ఉద్ధృతి కాస్త తగ్గడం, కేంద్ర ప్రభుత్వం సినిమా థియేటర్ల ప్రారంభానికి అనుమతులు ఇవ్వడంతో సినీ ఇండస్ట్రీలు మెల్ల మెల్లగా తమ కార్యకలాపాలను మొదలుపెట్టాయి. ఇప్పటికే బాలీవుడ్, కోలీవుడ్ పలు సినిమాల్లో సెట్స్ పైకి వెళ్లగా తాజాగా సినిమా షూటింగులు ఊపందుకున్నాయి. మొన్నటివరకు కరోనా భయంతో ఇంటిగేటు దాటని నటీ నటులు మెల్లమెల్లగా సెట్స్ లోకి వస్తున్నారు. పెండింగ్ లో పడిపోయిన సినిమాలను కంప్లీట్ చేస్తున్నారు. మళ్లీ సందడి మొదలైంది. కార్మికులకు చేతినిండా పని దొరుకుతోంది. కరోనాకు టీకా వచ్చేంతవరకు షూటింగ్ ప్రారంభించేది లేదని చెప్పిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాస్త మెత్తపడ్డాడు. వకీల్ సాబ్ మూవీ ఇప్పటికే 80 శాతం కంప్లీట్ కాగా.. మిగిలిన భాగం చిత్రీకరణ తిరిగి ప్రారంభించారు.

ప్రభాస్ రాధే శ్యామ్ సినిమా షూటింగ్ లో బిజీ బిజీగా ఉన్నాడు. ఇటీవలే ప్రభాస్ ఇటలీ షెడ్యూల్ పూర్తి చేసుకొని హైదరాబాద్ కు తిరిగి వచ్చాడు. ప్రతిష్టాత్మకమైన రాజమౌళి 'ఆర్ఆర్ఆర్' షూటింగ్ మొదలై ఎన్టీఆర్ టీజర్ విడుదల అయిన సంగతి కూడా తెలిసిందే. చరణ్, ఎన్టీఆర్ ఆ సినిమా షూటింగ్ లో బిజీ బిజీగా ఉన్నారు. ఇక చిరంజీవి -కొరటాల శివ కాంబినేషన్లో వస్తున్న ఆచార్య సినిమా ఆ కాలం కిందట చిత్రీకరణ ఆగిపోగా.. రేపటి నుంచి ఈ సినిమా తిరిగి సెట్స్ పైకి వెళ్లబోతోంది. ఇప్పటికే ఒక షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న అల్లు అర్జున్ పుష్ప మూవీలోకి అల్లు అర్జున్ కూడా ఇస్తున్నాడు. తూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ఇంకా బాలకృష్ణ -బోయపాటి, నాగార్జున వైల్డ్ డాగ్, వెంకీ నారప్ప సినిమాల షూటింగ్ ముమ్మరంగా జరుగుతోంది. వరుసబెట్టి అగ్ర హీరోలంతా చిత్రీకరణలో పాల్గొంటుండంతో సినీ ఇండస్ట్రీ మునుపటి జోష్ వచ్చింది.