Begin typing your search above and press return to search.

భామలు తెగ చుట్టేస్తున్నారుగా!!

By:  Tupaki Desk   |   3 Jun 2017 12:42 PM IST
భామలు తెగ చుట్టేస్తున్నారుగా!!
X
యంగ్ హీరోలు మినహాయిస్తే.. మిగిలిన హీరోలకు పట్టుమని ఏడాదికి ఒక సినిమా చేయడం కూడా కష్టం అయిపోతోంది. ఇక నుంచి సంవత్సరానికి రెండు సినిమాలు చేస్తానంటూ బీరాలు చాలామందే పలుకుతుంటారు కానీ.. తీరా ఆచరణలోకి వచ్చేసరికి ఒక్కటి రిలీజ్ చేయడానికే గగనం అయిపోతుంటుంది. కానీ హీరోయిన్స్ విషయానికి వస్తే మాత్రం.. చిన్నా పెద్దా తేడా అనేదేమీ లేదు.. చకచకా సినిమాలు చుట్టేస్తూ తెగ మెరిసిపోతున్నారు.

టాప్ బ్యూటీ సమంత ఈ ఏడాది ప్రారంభంలో నిశ్చితార్ధం.. చివర్లో పెళ్లి.. ఇవన్నీ బేస్ చేసుకుని అసలు సినిమాలు చేయదేమో అనుకున్నారు. కానీ ఈ భామ ఇప్పటికే రాజుగారి గది2 కంప్లీట్ చేసేసింది. మరోవైపు రామ్ చరణ్ తో నటిస్తోంది. మరో రెండు తమిళ సినిమాలు కూడా ఫినిష్ చేస్తోంది. స్టార్ హీరోయిన్ రేసులో టాప్ లో ఉన్న రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పటికే విన్నర్.. రారండోయ్ వేడుక చూద్దాం చిత్రాలతో పలకరించగా.. మహేష్ బాబుతో స్పైడర్.. బెల్లంకొండ శ్రీనివాస్ తో ఓ మూవీని ఈ ఏడాదే రిలీజ్ చేసేయనుంది.

ఎన్టీఆర్ తో జై లవ కుశ.. రవితేజతో టచ్ చేసి చూడు అంటోంది రాశి ఖన్నా. సావిత్రి జీవితగాధ మహానటి.. పవన్-త్రివిక్రమ్ సినిమాలో నటించేస్తోంది కీర్తి సురేష్. నానితో నిన్ను కోరి అంటున్న నివేదా థామస్.. ఎన్టీఆర్ తో జై లవ కుశలోనూ కనిపించనుంది. హీరోలు నెమ్మదిగా సినిమాలు చేస్తుండడం.. ఈ భామలకు చకచకా తమ పోర్షన్ ని ఫినిష్ చేసి పక్క సినిమాలకు వెళ్లిపోయేందుకు బాగానే కలిసొస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/