Begin typing your search above and press return to search.

పాటలు కూడా పాడేస్తారట!!

By:  Tupaki Desk   |   8 Dec 2015 5:30 PM GMT
పాటలు కూడా పాడేస్తారట!!
X
తెలుగు సినిమాలు చేస్తూ తెలుగులో మాట్లాడాలంటే నామోషీ ఏంటో అనుకునేవారికి ఇక్క‌డ స‌రైన స‌మాధానం దొరుకుతుంది. తెలుగులో నటిస్తూ తెలుగు నేర్చేసుకుని తెలుగ‌మ్మాయిల్లా క‌లిసిపోవ‌డానికి ఇరుగు పొరుగు ముద్దుగుమ్మ‌లు ఎంత‌గా త‌పిస్తున్నారో తెలుసుకుంటే ఆశ్చ‌ర్యం క‌ల‌గ‌క మాన‌దు. అస‌లు తెలుగంటే బాబోయ్ ..చాలా క‌ష్టం అని భ‌య‌ప‌డిపోయేవారెంద‌రో. తెలుగులో ఉన్నంత కాంప్లికేష‌న్ వేరే ఏ భాష‌లోనూ ఉండ‌దు అని చెబుతుంటారు కొంద‌రు.

కానీ అలాంటి వాటికి ఏమాత్రం అద‌ర‌క బెద‌ర‌క తెలుగు నేర్చేసుకుని తెలుగ‌మ్మాయిల్లా తెలుగు మాట్లాడేస్తూ ఆక‌ట్టుకుంటున్నారు మ‌న భామామ‌ణులు. అంతేకాదు త‌మ సినిమాలకు తామే డ‌బ్బింగులు చెప్పుకుంటూ ఆక‌ట్టుకుంటున్నారు. అసంపూర్ణంగా ఉందే అన్న అసంతృప్తి లేకుండా త‌మ క్యారెక్ట‌ర్ల‌కు తామే డ‌బ్బింగులు చెప్పుకుంటూ మ‌న‌సును నింపుకుంటున్నారు. అనుష్క‌ - స‌మంత‌ - త‌మ‌న్నా - శ్రుతిహాస‌న్ - ర‌కూల్ ప్రీత్‌ సింగ్‌ - రాశీఖ‌న్నా - రెజీన‌ - ప్ర‌ణీత.. ఇంత‌మంది నాయిక‌లు తెలుగును అన‌ర్గ‌ళంగా మాట్లాడేస్తున్నారు. అ అనే అక్ష‌రంతో ప‌య‌నాన్ని మొద‌లు పెట్టి ఇప్పుడు అం అః ల‌తో పాటు గుణింతాల్లోనూ రాటు దేలిపోయారు. ఏదో స‌మ‌యాభావం ఉంది అంటే త‌ప్ప త‌మ సినిమాల‌కు తామే డ‌బ్బింగులు చెప్పుకోవ‌డానికి వీళ్లంతా రెడీగా ఉన్నారు. పూరీ - క్రిష్‌ - త్రివిక్ర‌మ్ లాంటి ద‌ర్శ‌కులు క‌థానాయిక‌ల చేతే అనువాదం చెప్పించేందుకు రెడీగా ఉంటారు కాబ‌ట్టి.. అలాంటి టైమ్‌ లో వర్క‌వుట్ చేస్తున్నారు.

తెలుగును వేగంగా నేర్చుకుని తెలుగు ఆడియెన్‌ ని ప‌ట్టేసిన భామ‌లుగా అనుష్క‌ - స‌మంత‌ - త‌మ‌న్నాల్ని చెప్పుకోవ‌చ్చు. ఈ భామ‌లు ఆరంగేట్ర‌మే ఇక్క‌డ స‌క్సెస్‌ లు అందుకుని వెంట‌నే తెలుగ‌మ్మాయిలుగా ఆక‌ట్టుకునే చాణ‌క్యం ప్ర‌ద‌ర్శించారు. ఆ త‌ర్వాత అదే బాట‌లో ర‌కూల్ ప్రీత్‌ - రాశీ ఖన్నా - రెజీన - ప్ర‌ణీత .. ఇదే బాట‌లో స‌క్సెస‌య్యారు. డబ్బింగులే కాదు.. త్వరలో తెలుగులో పాటలు కూడా పాడతాం అంటున్నారు.