Begin typing your search above and press return to search.

క్రిస్మస్ నాడు బ్యూటీల విషెస్

By:  Tupaki Desk   |   25 Dec 2017 10:46 AM GMT
క్రిస్మస్ నాడు బ్యూటీల విషెస్
X
క్రిస్మస్ సందర్భంగా శుభాకాంక్షలు చెప్పడం సహజమే. సోషల్ మీడియాలో తమ అభిమానులకు తెగ చేరువ అయిపోయిన సెలబ్రిటీలు.. ప్రతీ పండుగకు వారిని విష్ చేస్తున్నారు. క్రిస్మస్ కు కూడా ఇలా అనేకమంది హీరోయిన్లు శుభాకాంక్షలు తెలిపి అభిమానులకు విషెస్ చెప్పారు.

టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ మెర్రీ క్రిస్మస్ అంటూ.. ఈ పండుగ థీమ్ తో వైట్ డ్రెస్ లో భలే చూడమచ్చటైన ఫోటోను పోస్ట్ చేసింది. వరుస హిట్స్ తో జోరు మీద ఉన్న మెహ్రీన్ కౌర్ పీర్జాడా.. బుట్టబొమ్మలా తయారయి మరీ క్రిస్మస్ విషెస్ చెప్పింది. ఎవరికి వారే శాంతాక్లాజ్ గా మారి కలలు నెరవేర్చుకోమంటూ.. రకుల్ ప్రీత్ సింగ్ చెప్పుకొచ్చింది. జీవితం అంతా ఆనంద క్షణాలతో వెలిగిపోవాలంటూ మంచు లక్ష్మి విషెస్ చెప్పింది. మీ ఇల్లు మనసులు ఆనందంతో నిండాలని రమ్యకృష్ణ కోరుకుంది.

తన క్రిస్మస్ సెలబ్రేషన్స్ ను చూపించి మరీ విషెస్ చెప్పింది త్రిషాకృష్ణన్. ఇక మలయాళీ భామలు అను ఇమాన్యుయేల్.. నివేదా థామస్.. లు కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పారు. మన్నారా చోప్రా కూడా తన స్టైల్ లో ఫోటోలకు పోజ్ ఇచ్చి క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పింది. టీవీ కం టాలీవుడ్ భామ అనసూయ అయితే.. క్రిస్మస్ విషెస్ చెప్పిన తీరు సూపర్బ్ అనాల్సిందే.