Begin typing your search above and press return to search.

కొత్త హీరోయిన్ ని కావాలనే తొక్కేస్తున్నారా?

By:  Tupaki Desk   |   5 Feb 2016 3:30 AM GMT
కొత్త హీరోయిన్ ని కావాలనే తొక్కేస్తున్నారా?
X
సినిమా అన్నాక హీరో ఎంత ముఖ్యమో.. ఆ సినిమాలో నటించిన హీరోయిన్ కూడా అంతే ఇంపార్టెంట్. అందుకే కాంబినేషన్స్ విషయంలో చాలా అలర్ట్ గా ఉంటారు మూవీ మేకర్స్. కానీ ఇప్పుడొస్తున్న ఓ మూవీ విషయంలో మాత్రం హీరోయిన్ ని అసలు పట్టించుకోకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. కావాలనే ఆ హీరోయిన్ ని డౌన్ చేస్తున్నారంటూ ఇండస్ట్రీ జనాలు గుసగుసలాడుకుంటున్నారు.

కుర్ర హీరో నటించిన ఓ సినిమాకి.. కనీసం ఆడియో ఫంక్షన్ లో కూడా ఆ మూవీ హీరోయిన్ కనిపించకపోవడం ఆశ్చర్యం కలిగించింది. అయితే, ఇండస్ట్రీలో అరడజన్ మందిని పిలిచి ఆ ఈవెంట్ ని కంప్లీట్ చేసింది సినిమా యూనిట్. అలాగే ప్రమోషన్ విషయంలో కూడా ఎక్కడా హీరోయిన్ ని మాత్రం పైకి తేవడం లేదు. ఆ మూవీలో ఐటెం సాంగ్ చేసిన ఓ స్టార్ హీరోయిన్ నే ప్రమోషన్స్ కు వాడుకుంటున్నారు. పోస్టర్లు - పబ్లిసిటీ అంతా ఐటెం భామ చుట్టూనే తిరుగుతున్నాయి. కనీసం ప్రమోషన్ ఈవెంట్స్ లో కూడా హీరోయిన్ యాక్టివ్ గా సరిగా పార్టిసిపేట్ చేయకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

మరీ అసలు కనిపించలేదు అనకుండా.. ఒకట్రెండు చోట్ల మాత్రం హీరోయిన్ కనిపించిందంతే. ఐటెం సాంగ్ లో కనిపించిన సుందరాంగికి ఇచ్చిన ప్రిఫరెన్స్ లో పదో వంతు కూడా హీరోయిన్ కి ఇవ్వకపోవడమే.. ఇలాంటి అనుమానాలకు కారణమవుతోంది. ఇదంతా ఉద్దేశ్యపూర్వకంగానే చేస్తున్నారని, షూటింగ్ టైం లో వచ్చిన డిఫరెన్సులే ఇందుకు కారణమని చెప్పుకుంటున్నారు. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో మీకు అర్ధమైంది కదూ.!