Begin typing your search above and press return to search.
పైసా వసూల్ కాన్సెప్ట్ ని వంటబట్టించుకున్న టాలీవుడ్ హీరోలు..!
By: Tupaki Desk | 6 Jun 2021 8:59 AM ISTటాలీవుడ్ లో ఇప్పుడు కుర్ర హీరోల నుంచి పెద్ద హీరోల వరకూ అందరూ రెండు చేతులా సంపాదించడం అలవాటు చేసుకున్నారు. ఓ వైపు సినిమాల్లో హీరోలుగా నటిస్తూనే మరోవైపు పలు వ్యాపారాలు చేస్తూ నాలుగు రాళ్లు వెనకేసుకుందాం అనే విధంగా ఆలోచిస్తున్నారు. ఇదే క్రమంలో నిర్మాతలుగా మారి సినిమాల నిర్మాణంలో కూడా భాగం పంచుకుంటున్నారు. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న సినిమాలలో చాలావరకు హీరోల భాగస్వామ్యం ఉన్నవే ఉన్నాయి.
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 'ఆచార్య' చిత్రాన్ని తనయుడు రామ్ చరణ్ మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ వారితో కలిసి నిర్మిస్తున్నారు. అలానే 'లూసిఫర్' తెలుగు రీమేక్ నిర్మాణంలో కూడా చరణ్ ఒక నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. 'డ్రైవింగ్ లైసెన్స్' రీమేక్ కి కూడా చెర్రీ నే నిర్మాత అని అంటున్నారు. నందమూరి కళ్యాణ్ రామ్ ఇప్పుడు తన సినిమాలతో పాటుగా తమ్ముడు ఎన్టీఆర్ చిత్రాలకు కూడా ప్రొడ్యూసర్ గా ఉంటున్నాడు. కొరటాల శివ - ప్రశాంత్ నీల్ లతో తారక్ చేసే సినిమాలకు కళ్యాణ్ రామ్ ఒక నిర్మాత. అలానే 'బింబిసార' చిత్రాన్ని కూడా ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లోనే నిర్మిస్తున్నారు.
నేచురల్ స్టార్ నాని నిర్మాతగా అడవి శేష్ హీరోగా 'హిట్' చిత్రానికి సీక్వెల్ 'హిట్ 2' తెరకెక్కుతోంది. యంగ్ హీరో విజయ్ దేవరకొండ తన బ్యానర్ లో తమ్ముడు ఆనంద్ దేవరకొండ తో 'పుష్పక విమానం' సినిమా నిర్మిస్తున్నాడు. అలానే పృథ్వీ సేనారెడ్డి అనే కొత్త డైరెక్టర్ తో ఓ చిన్న సినిమా ప్లాన్ చేస్తున్నాడు. కమెడియన్ సత్య ని హీరోగా పరిచయం చేస్తూ సందీప్ కిషన్ 'వివాహ భోజనంబు' చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ ని మళ్ళీ యాక్టీవ్ చేసిన పవన్.. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీతో కలిసి 15 సినిమాలు నిర్మించబోతున్నట్టు ప్రకటించాడు.
'కింగ్' అక్కినేని నాగార్జున తన హోమ్ బ్యానర్ లో 'బంగార్రాజు' సినిమాతో పాటుగా తనయుడు అఖిల్ తో ఓ యాక్షన్ ఎంటర్టైనర్ ప్లాన్ చేస్తున్నారు. అలానే రాజ్ తరుణ్ తో ఓ సినిమా.. వైష్ణవ్ తేజ్ తో ఓ మూవీ చేయనున్నారు. దగ్గుబాటి రానా తమ ప్రొడక్షన్ లో రామానాయుడు ఫిలిం స్టూడియోస్ పూర్వ విద్యార్థులతో రెండు ప్రాజెక్ట్స్ నిర్మిస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు 'సర్కారు వారి పాట' తో పాటుగా అడవి శేష్ తో 'మేజర్' సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నారు. మంచు విష్ణు 'సన్ ఆఫ్ ఇండియా' చిత్రాన్ని నిర్మిస్తుంటే.. మంచు మనోజ్ 'అహం బ్రాహ్మాస్మి' స్వీయ నిర్మాణం చూసుకుంటున్నాడు. నితిన్ 'మ్యాస్ట్రో' సినిమా హోమ్ బ్యానర్ లో తెరకెక్కుతోంది. సుధీర్ బాబు 'ఆ అమ్మాయి గురించి చెప్పాలి' చిత్రంతో నిర్మాతగా మారుతున్నాడు. ఇలా టాలీవుడ్ హీరోలందరూ పైసా వసూల్ కాన్సెప్ట్ ని వంటబట్టించుకొని రెండు చేతులా సంపాదిస్తున్నారు.