Begin typing your search above and press return to search.

ముందు సినిమా రెడీ చేద్దాం.. రిలీజ్ సంగతి తర్వాత చూద్దాం...!

By:  Tupaki Desk   |   4 Sept 2020 3:00 PM IST
ముందు సినిమా రెడీ చేద్దాం.. రిలీజ్ సంగతి తర్వాత చూద్దాం...!
X
కరోనా మహమ్మారి కారణంగా గత ఆరు నెలలుగా థియేటర్స్ మల్టీప్లెక్సెస్ క్లోజ్ అయ్యున్నాయి.. సినిమా షూటింగ్స్ ఆగిపోయాయి. అయితే ఇన్నాళ్లు ఎక్కడికక్కడ ఆగిపోయిన సినిమా షూటింగ్స్ మాత్రం ఇప్పుడిప్పుడే తిరిగి ప్రారంభం అవుతున్నాయి. కేంద్రం కొన్ని షరతులతో అన్ని రకాల షూటింగ్స్ చేసుకోవడానికి అనుమతిచ్చింది. ఇప్పటికే 'కింగ్' నాగార్జున 'వైల్డ్ డాగ్' మూవీ కోసం సెట్స్ లో అడుగుపెట్టేసాడు. ఇప్పుడు నాగ్ బాటలోనే చాలా మంది టాలీవుడ్ హీరోలు నడవడానికి రెడీ అయ్యారు. యువసామ్రాట్ నాగచైతన్య సెప్టెంబర్ 7న 'లవ్ స్టోరీ' షూటింగ్ లో పాల్గొంటాడని తెలుస్తోంది. ఇక యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సెప్టెంబర్ సెకండ్ వీక్ లో 'రాధే శ్యామ్' షూట్ లో పాల్గొంటారు.

యువ హీరో నాగశౌర్య సెప్టెంబర్ 18న సెట్స్ లో అడుగుపెడతానని ప్రకటించాడు. 'సుబ్రహ్మణ్యపురం' డైరెక్టర్ ధీరేంద్ర సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. అలానే నిఖిల్ సిద్దార్థ్ 'కార్తికేయ 2' కూడా అక్టోబ‌ర్ లో మొద‌ల‌వ్వ‌నుందని సమాచారం. గీతాఆర్ట్స్ బ్యానర్ పై కార్తికేయ నటిస్తున్న 'చావు కబురు చల్లగా' షూటింగ్ కూడా త్వరలో స్టార్ట్ కాబోతోంది. మెగాస్టార్ చిరంజీవి - కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న 'ఆచార్య' కూడా సెట్స్ లో అడుగుపెట్టడానికి రెడీ అవుతున్నాడు. అయితే వీరందరూ సినిమాలు కంప్లీట్ చేసి రెడీగా పెట్టుకున్నప్పటికీ ఇప్పట్లో రిలీజులు మాత్రం కష్టమే అంటున్నారు.

కాగా ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే సంక్రాంతి వ‌ర‌కు థియేట‌ర్స్ తెరవడం కష్టమే అనిపిస్తోందని ఇండస్ట్రీ పెద్దలు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ థియేటర్స్ ఓపెన్ చేసినా జ‌నాలు నుంచి స్పంద‌న పెద్ద‌గా రాక‌పోవ‌చ్చని.. క‌ష్ట‌మో నష్ట‌మో ఓటీటీలను న‌మ్ముకుంటే బెట‌ర్ అనే ఫీలింగ్ కి తెలుగు ఇండ‌స్ట్రీ పెద్ద‌లు వ‌చ్చేశారట. అందుకే ఇప్పుడు షూటింగ్స్ కంప్లీట్ చేస్తున్న మేకర్స్ అందరూ రాబోయే రోజుల్లో ప‌రిస్థితులను బట్టి తమ సినిమా రిలీజ్ చేద్దామనే ప్లాన్ లో ఉన్నారని తెలుస్తోంది. అయితే ఇప్పటికే కంప్లీట్ అయిన సినిమాల్లో కొన్ని ఓటీటీ రిలీజ్ రెడీ అవుతుండగా మరికొన్ని సినిమాల విడుదల విషయంలో మాత్రం క్లారిటీ రావడం లేదు.