Begin typing your search above and press return to search.

కామెంట్: రెండు భాషలు తీస్తే పేలడమే

By:  Tupaki Desk   |   2 Jun 2018 8:00 PM IST
కామెంట్: రెండు భాషలు తీస్తే పేలడమే
X
రెండు భాషలలో మార్కెట్ పెంచుకునేందుకు చాలా మంది హీరోలు ప్రయత్నిస్తుంటారు. హీరో హీరోయిన్లు రెండు లాంగ్వేజెస్ లో ఇరగదీసేయడం అనే ట్రెండ్.. సావిత్రి కాలం నుంచి ఉంది. కానీ ఇరు భాషల్లో మార్కెట్ పెంచుకునేందుకు టాలీవుడ్ హీరోలు కుస్తీ పట్టడం ఈ మధ్యనే స్టార్ట్ అయింది. తమిళ హీరోల మాదిరిగా మనోళ్లలో సాలిడ్ గా సక్సెస్ అయింది మాత్రం అల్లు అర్జున్ ఒక్కడే అని చెప్పాలి(బాహుబలిని పక్కన పెడితేనే సుమా).

చాలామంది తెలుగు హీరోలు ఇందుకోసం తెగ కుస్తీ పడుతున్నారు కానీ.. వాళ్లకు చుక్కెదురు అవుతూనే ఉంది. రీసెంట్ గా అయితే స్పైడర్ మూవీతో మహేష్ బాబుకు తగిలిన ఎదురుదెబ్బను చెప్పుకోవాలి. ఈ సినిమాకు ప్రతీ సీన్ ను రెండు సార్లు తీసి బాగానే కష్టపడ్డారు టీం. అయినా ఈ బైలింగ్యువల్.. రెండు భాషల్లోనూ జెండా తన్నేసింది. ఒక్క మహేష్ కు మాత్రమే కాదు.. ఇలాంటి అనుభవాలు చాలామందికి ఉన్నాయి. అల్లు శిరీష్ తన అరంగేట్ర చిత్రం గౌరవంతోనే ఇలాంటి ఎటెంప్ట్ చేశాడు. కానీ ఇది కూడా సేమ్ పరిస్థితి.

నాని చేసిన జెండాపై కపిరాజు సిట్యుయేషన్ కూడా ఇదే. శర్వానంద్ కూడా ఓ బైలింగ్యువల్ చేశాడు కానీ.. అదిక్కడ థియేటర్ల మొహమే చూడలేదు. వీరందరికంటే ముందు.. రామ్ చరణ్ చేసిన జంజీర్ రీమేక్ తుఫాన్ గురించి కూడా చెప్పుకోవాలి. ఇది కూడా పేలిపోయిన సినిమానే. అందుకే ఇప్పుడు తెలుగు హీరోలు బై లింగ్యువల్స్ అంటే బెదిరిపోతున్నారు. రీసెంట్ గా ఆది దగ్గరకు ఓ ఛాన్స్ వస్తే.. రెండో మాట లేకుండా వద్దని చెప్పేశాడట. తెలుగు హీరోలకు బైలింగ్యువల్స్ అంతగా అచ్చి రావడం లేదు.