Begin typing your search above and press return to search.

నిజమైన హీరో అనిపించుకోవడం కోసం..

By:  Tupaki Desk   |   13 Sept 2015 9:13 AM IST
నిజమైన హీరో అనిపించుకోవడం కోసం..
X
తెలుగు సినిమాల పరిస్థితి మారింది. నిలబడి ఫైట్ చెయ్యడాలు - కాలు కదపకుండా స్టెప్పులేయడాలు వంటి సీన్లకు ఆదరణ తగ్గింది. గతంలో భారీ యాక్షన్ సన్నివేశాలు - సాహసోపేతమైన ఫీట్లు వుంటే డూప్ ని పెట్టి మేనేజ్ చేసేయచ్చు అనుకున్న హీరోలు ఇప్పుడు భిన్నంగా ఆలోచిస్తున్నారు. అభిమానులకు తాము నిజమైన హీరోలు అనే భావనకోసం ఎంత రిస్కైనా చెయ్యడానికి వెనుకాడటం లేదు.

బాహుబలి సినిమా ప్రభాస్ జీవితాన్నే మార్చేసింది. ఈ సినిమా కోసమే ఏకంగా ఆరు నెలలు కండలను పెంచడంలో నిమగ్నమైపోయాడు. మొదటి భాగంలో అతని కష్టం దాదాపు కనిపించినా రెండవ భాగంలో మరింత ఎక్కువ స్థాయిలో వీక్షించగలమని సమాచారం. చిన్నప్పటి నుండీ గుర్రపుస్వారీ నేర్చుకున్న చరణ్ మగధీర కోసం పొగరుబోతు అశ్వాలను సైతం అధిరోహించాడు. ప్రస్తుతం తెరకెక్కుతున్న బ్రూస్ లీ కోసం మార్షల్ ఆర్ట్స్ లో ప్రత్యేక శిక్షణ పొందడం విశేషం. స్టైలిష్ స్టార్ బన్నీ కూడా బద్రీనాధ్ - రుద్రమదేవి చిత్రాల కోసం వియాత్నంలో మార్షల్ ఆర్ట్స్ - గుర్రపు స్వారీ నేర్చుకున్నాడు.

పెద్ద హీరోలేకాదు ఇటువంటి సాహసాలు చిన్న హీరోలు కూడా చేయడం ఆనందకరం. డైనమైట్ చిత్రంలో ఎడతెరిపీ యాక్షన్ సన్నివేశాలు వున్నందున ప్రత్యేకంగా వీటిపై శిక్షణ పొందినట్టు విష్ణు ఇప్పటికే పలుమార్లు చెప్పాడు. ఇకఫైట్ లలో తనకంటూ వైవిధ్యం వుండాలని ఆశిస్తూ రామ్ నాన్చాక్ నేర్చుకుని మరీ దేవదాసు - పండగ చేస్కో సినిమాలలో అలరించాడు. మరి వీళ్ళంతా నిజంగా హీరోలే కదండీ..