Begin typing your search above and press return to search.

కామెంట్‌: ప్రొడక్షన్ అంటే ప్లస్‌ అండ్‌ మైనస్‌

By:  Tupaki Desk   |   17 Sept 2015 1:00 AM IST
కామెంట్‌: ప్రొడక్షన్ అంటే ప్లస్‌ అండ్‌ మైనస్‌
X
సినిమా నిర్మాణం.. అబ్బో ఇదో బ్రహ్మ పదార్ధంలా తయారైంది. ఏది ఆడుతుందో.. ఏ పాయింట్ జనాలకు నచ్చుతుందో ముందే పసిగట్టాలి. జనాలకు చేరేలా ప్రమోషన్ చేసుకోవాలి. ఇది అందరికీ సాధ్యం కావడం లేదు. చేసినా ఒకటీ అరా తప్ప.. అందరికీ లాభాలపంట పండడంలేదు. ముఖ్యంగా హీరోహీరోయిన్ లకి కూడా ప్రొడక్షన్ పై బాగానే మోజు ఉంటోంది. గతంలో చాలామంది చేతులు కాల్చుకున్నా ఇప్పటికీ తామూ ఓ ట్రయల్ వేస్తామనేవారే ఎక్కువగా కనిపిస్తారు.

తన ప్రొడక్షన్ లో సినిమాలు తీస్తున్నాడు కళ్యాణ్ రామ్. రీసెంట్ గా అఖిల్ తో ప్రొడ్యూసర్ అవతారమెత్తాడు నితిన్. శ్రీమంతుడి నిర్మాణంలో భాగమయ్యాడు మహేష్. చిరు సినిమాకి తానే ప్రొడ్యూసర్ అంటాడు చరణ్. కిక్ 2కి డబ్బులిచ్చి చేతులు కాల్చుకున్నాడు ఎన్టీఆర్. ఈ మూవీ ఇచ్చిన షాక్ తో ఇప్పుడు నిర్మాణం అంటే భయపడే పరిస్థితి వచ్చింది. అయితే.. ఓ విషయం గుర్తుపెట్టుకోవాలి మహేష్ ఎక్కడ సక్సెస్ అయ్యాడో... ఎన్టీఆర్ అక్కడే ఫెయిలయ్యాడు. సొంత సినిమాపై ఇన్వెస్ట్ చేసి సూపర్ స్టార్ లాభపడితే.. తన అన్న ఇంకో హీరోతో చేసే సినిమాకి డబ్బులు పెట్టి 12కోట్లు నష్టపోయాడు యంగ్ టైగర్.

దీన్నిబట్టి అర్ధం కావాల్సి ఏంటంటే నిర్మాణాలకు వీలైనంత దూరంగా ఉండాలి నటులు. ప్రాజెక్టులను బట్టి ఫైనాన్స్ చేయాలి కానీ.. బంధుత్వాలు, మొహమాటాలు పోతే ఇలాగే ఉంటుంది పరిస్థితి. ఒకవేళ డబ్బులు పెట్టినా.. తాము నటించే ప్రాజెక్టులపై ఇన్వెస్ట్ చేసుకుంటే.. అంతో ఇంతో బెటర్. ఈ విషయంలో మంచు ఫ్యామిలీ సూపర్ అనాలి. లక్ష్మీప్రసన్న పిక్చర్స్ బ్యానర్ ప్రారంభించి, తన సినిమాలను తానే ప్రొడ్యూస్ చేసుకునే ట్రెండ్ మొదలుపెట్టిందే మోహన్ బాబు కదా. అయినా మూవీ ప్రొడక్షన్‌ అంటేనే ప్లస్‌ అండ్‌ మైనస్‌ ఉంటాయి. రెండూ తప్పవు.