Begin typing your search above and press return to search.

కొత్త అందాలు కోరుకుంటున్న బడా హీరోలు

By:  Tupaki Desk   |   17 Sept 2015 1:00 AM IST
కొత్త అందాలు కోరుకుంటున్న బడా హీరోలు
X

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్లు ఎప్పుడూ వేళ్ళమీద లేక్కబెట్టే సంఖ్యలోనే వుండడం ఒకరకంగా దురదృష్టం.. మరొక రకంగా అదృష్టం. ప్రతీ ఒక్కరూ ఆ ఐదారుగురు భామలతోనే చిందేయాలంటే కుదరని విషయం, ఒకవేళ తీసినా ప్రేక్షకులకు మొహం మొత్తేసే అవకాశాలు వున్నాయి. అందుకే ఇప్పుడు బడా హీరోలు సైతం కొత్త భామలను డైరెక్ట్ గా తమ సినిమాతో వెండితెరకు పరిచయంచేయడంలో వెనుకడుగు వేయడంలేదు.

ప్రేమమ్ సినిమాలో మంచి మార్కులు కొట్టేసిన అనుపమ పరమేశ్వరన్ ప్రస్తుతం తెలుగులో త్రివిక్రమ్ సినిమాలో ఒక ముఖ్య పాత్ర పోషించనుంది. ఒకవిధంగా ఈ భామకిది గ్రాండ్ లాంచ్ లాంటిదే. సాయేషా అఖిల్ సినిమాలో నటిస్తూ గోల్డెన్ ఛాన్స్ కొట్టేసిన విషయం తెలిసినదే. కంచె ట్రైలర్ లో యుద్ధాల తరువాత అంతలా మెప్పించిన ప్రగ్యా జైస్వాల్ కూడా కొత్త నాయికే.

ఇక పూరీ లోఫర్ లో నటిస్తున్న దిశాపటానీ, రామ్ రాబోయే సినిమాలో చాన్స్ కొట్టేసిన కేరళ భామ కీర్తీ సురేష్ లు కూడా పెద్ద సినిమాలతోనే తమ మొహం చూపించనున్నారు. వీరందరికీ ఒకవిధంగా గ్రాండ్ లాంచ్ దొరికింది కాబట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అందంతో పాటూ అభినయం కూడా వుందని నిరువుపించుకుంటే త్వరలోనే బిగ్ లీగ్ కి టికెట్ దొరుకుతుందనడంలో సందేహంలేదు.