Begin typing your search above and press return to search.

అర్జెంటుగా ఓ హిట్టు కావాలి బాసూ..

By:  Tupaki Desk   |   2 Dec 2015 11:00 PM IST
అర్జెంటుగా ఓ హిట్టు కావాలి బాసూ..
X
ఒక స్టార్ హీరో సినిమా బాగోకపోతే చీదరించుకున్న మన తెలుగు ప్రేక్షకులే వెంటనే అదే హీరో తదుపరి సినిమా గనుక నచ్చితే కీర్తించడంలో వెనుకాడరు. అందుకే మన తెలుగు ఇండస్ట్రీలో హీరోలది దాదాపు ఎవెర్ గ్రీన్ మార్కెట్. ఉదాహరణకి '1', 'ఆగడు' వంటి సినిమాలు ఫ్లాపయినా మహేష్ తదుపరి సినిమా శ్రీమంతుడు ఘన విజయం సాధించి తన కెరీర్ బెస్ట్ గా నిలిచింది. ఇలా హిట్ కోసం కొందరు తారలు ఎదురు చూడడం గమనార్హం.

సింహా - లెజెండ్ లతో అభిమానులకు పూనకం తెప్పించిన బాలయ్య ఆ మధ్య లయన్ తో నిరాశపరిచాడు. అయితే తనని వీడిపోయిన హిట్ ని తిరిగి తెప్పించుకునే ప్రయత్నంలో ప్రస్తుతం డిక్టేటర్ సినిమాతో బిజీగా వున్నాడు. మాస్ రాజా రవితేజకి కిక్ సీక్వెల్ తో పరాభవం ఎదురైంది. ఆ లోటుని బెంగాల్ టైగర్ తో పూడ్చాలని తపిస్తున్నాడు.

అగ్రతారలేకాదు ఈ జాబితాలో యువతారలకూ చోటుంది. యువకధానాయకులలో జోరుమీదున్న రామ్ కి ఇటీవల కాలంలో నికార్సైన హిట్ లేదు. తన సొంత బ్యానర్ లో తీసిన సినిమాలు సైతం నిరాశపరుస్తున్నాయి. ఈ క్రమంలో నేను శైలజ సినిమాని జాగ్రత్తగా తెరకెక్కిస్తున్నాడు. సునీల్ హిట్ మాట మర్చిపోయి చాన్నాళ్ళయింది. కృష్ణాష్టమితోనైనా అది తిరిగి గుర్తుకువస్తుందో లేదో చూడాలి. మనం తరువాత అలరించాలేకపోయిన నాగచైతన్య మజ్నుగా ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోవాలని కోరుకుందాం.