Begin typing your search above and press return to search.

పేరు వాడుతున్నాడు.. పైస‌లు తీసుకుంటున్నాడు..!

By:  Tupaki Desk   |   18 Jun 2021 5:00 PM IST
పేరు వాడుతున్నాడు.. పైస‌లు తీసుకుంటున్నాడు..!
X
టాలీవుడ్ హీరోలందరూ ఇప్పుడు రెండు చేతులా సంపాదించాలనే ఆలోచనతో ముందుకు వెళ్తున్నారు. కేవలం సినిమాలకే పరిమితం కాకుండా వేరే వ్యాపారాల్లో కూడా పెట్టుబడులు పెడుతున్నారు. ఈ క్రమంలో కొందరు హీరోలుగా సినిమాలు చేస్తూనే.. నిర్మాతగా మారి ప్రొడక్షన్ లోకి దిగుతున్నారు. ఇప్పుడు ఇండస్ట్రీలో చాలామంది హీరోలు ప్రొడక్షన్ హౌస్ ఓపెన్ చేసి, కొత్తగా నిర్మాత అనే ట్యాగ్ తగిలించుకున్నారు. అయితే వీరిలో డబ్బులు పెట్టి నిర్మాణంలో భాగం పంచుకునే హీరోలు తక్కువ మందే ఉన్నారట. టైటిల్ కార్డ్ లో ప్రొడ్యూసర్ గా హీరో పేరు ఉన్నా.. డబ్బులు మాత్రం వేరే వారితో ఖర్చు చేయిస్తున్నారని తెలుస్తోంది.

టాలీవుడ్ హీరో ఒకరు నిర్మాతగా మారి బయటి హీరోలతో చిన్న సినిమాలు నిర్మిస్తున్నారు. ఇప్పటి వరకు అతని పేరు మీద తీసిన సినిమాలన్నీ సక్సెస్ అయ్యాయి. వైవిధ్యమైన కాన్సెప్ట్ తో వచ్చిన ఫస్ట్ సినిమా జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిపెడితే.. క్రేజీ యువ హీరోతో రెండో సినిమా తీసి సొమ్ములు చేసుకున్నాడు. ఇప్పుడు ఇదే పంధాలో మరికొన్ని సినిమాలు లైన్ లో పెట్టాడు. అంతేకాదు త‌న బ్యాన‌ర్ ని ఇప్పుడు తమిళ మ‌ళ‌యాల క‌న్న‌డ ఇండస్ట్రీలలో విస్తరించాలని ప్లాన్స్ చేస్తున్నారని తెలుస్తోంది. అయితే ఇక్కడ విషయమేంటంటే.. ఆ హీరో ఇందులో ఒక్క రూపాయి కూడా పెట్టుబ‌డి పెట్టడం లేదట. తన బ్యానర్ పేరుతో సినిమా రెడీ అవుతున్నప్పటికీ డబ్బులు పెట్టేది ఇతర నిర్మాతలని సినీ వర్గాల్లో చెప్పుకుంటున్నారు. అంటే కేవలం త‌న పేరు వాడుకొని ఆ హీరో పైస‌లు తీసుకుంటున్నాడన్నమాట.