Begin typing your search above and press return to search.

మ‌న హీరోల్లో ఆ క్యారెక్ట‌ర్ చేసేదెవ‌రు?

By:  Tupaki Desk   |   13 April 2017 8:17 PM IST
మ‌న హీరోల్లో ఆ క్యారెక్ట‌ర్ చేసేదెవ‌రు?
X
మ‌న హీరోలు వ‌య‌సుకు త‌గ్గ పాత్ర‌లు చేయ‌డం అరుదు. 60 ఏళ్లు వచ్చేసినా కుర్రాళ్ల లాగే కనిపించాలనుకుంటారు మ‌న స్టార్లు. వాళ్లు చాలా వరకు ఎంచుకునేది లార్జర్ దన్ లైఫ్ క్యారెక్టర్లే. సామాన్యుడిలా.. ఒరిజిన‌ల్ ఏజ్ కు త‌గ్గ‌ట్లుగా కనిపించడానికి అంతగా ఇష్టపడరు. ఐతే గ‌తంతో పోలిస్తే ఈ మ‌ధ్య కొంచెం ప‌రిస్థితి మెరుగైంది.విక్ట‌రీ వెంక‌టేష్ ఈ మ‌ధ్యే గురులో మిడిలేజ్డ్ క్యారెక్ట‌ర్ చేశాడు. నాగార్జున కూడా అప్పుడ‌ప్పుడూ ప్ర‌యోగాలు చేస్తున్నాడు. ఒరిజినాలిటీకి ద‌గ్గ‌రుండే పాత్ర‌లు.. సినిమాలు చేస్తున్నాడు. మ‌రి వీరు కానీ.. ఇంకే స్టార్ హీరో అయినా కానీ త‌మిళ లేటెస్ట్ మూవీ ప‌వ‌ర్ పాండిని రీమేక్ చేస్తారా అన్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌.

ధ‌నుష్ దర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్న సినిమా ప‌వ‌ర్ పాండి. ఈ శుక్ర‌వార‌మే ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఐతే ముందుగానే ప్రెస్ వాళ్ల‌కు.. ఫిలిం సెల‌బ్రెటీల‌కు స్పెష‌ల్ షో వేయ‌గా మంచి స్పంద‌న వ‌చ్చింది. సినిమా హిట్ట‌వ‌డం గ్యారెంటీ అంటున్నారు. మ‌రి ఈ సినిమా మీద మ‌న హీరోల క‌ళ్లేమైనా ప‌డ‌తాయేమో చూడాలి. ఐతే ఈ సినిమాను ఒప్పుకోవ‌డం సులువేం కాదు. ఎందుకంటే ఇందులో హీరో 60 ఏళ్ల వాడిగా క‌నిపించాడు. రాజ్ కిర‌ణ్ చేసింది ఆ వ‌య‌సు పాత్రే. ఆయ‌న త‌న వ‌య‌సుకు త‌గ్గ‌ట్లే క‌నిపించాడు. ఓ వృద్ధుడు త‌న 60 ఏళ్ల వ‌య‌సులో త‌న జీవితాన్ని స‌రికొత్త‌గా ఆవిష్క‌రించుకునే క‌థ‌తో తెరకెక్కిన సినిమా ఇది. మ‌రి మ‌న స్టార్ హీరోలెవ‌రైనా ఈ సినిమాను రీమేక్ చేస్తారా లేక ప్ర‌కాష్ రాజ్.. జ‌గ‌ప‌తిబాబు లాంటివాళ్లేమైనా ట్రై చేస్తారా.. చూడాలి మ‌రి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/