Begin typing your search above and press return to search.
కథ ఒకరితో.. సినిమా ఇంకొకరితో
By: Tupaki Desk | 28 Feb 2016 11:00 PM ISTపది రోజుల కిందట రిలీజైన ‘కృష్ణాష్టమి’ నిజానికి అల్లు అర్జున్ కోసం అనుకున్న కథ. కానీ అనుకోకుండా సునీల్ తెరమీదికి వచ్చాడు. గత ఏడాది వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన ‘లోఫర్’ కథను పూరి జగన్నాథ్ రాసుకున్నది అతడి కోసం కాదు. నితిన్ కోసం. అతను కాదంటే వరుణ్ దగ్గరికి వచ్చింది. ఇండస్ట్రీలో ఇలా ఒకరి కోసం పుట్టిన కథ.. ఇంకొకరి దగ్గరికి వెళ్లడం కొత్తేమీ కాదు. ఐతే ఈ మధ్య ఈ టైపు మార్పులు చాలా చాలా జరిగిపోతున్నాయి. ఆల్రెడీ నితిన్ వదులుకున్న ‘లోఫర్’లో నటించి దెబ్బ తిన్నప్పటికీ.. తాజాగా వరుణ్ మళ్లీ వేరొకరి కోసం తయారు చేసుకున్న కథలో చేయడానికి రెడీ అవుతున్నాడు. శ్రీను వైట్ల దర్శకత్వంలో వరుణ్ చేయబోతున్న సినిమాను నిజానికి రామ్ చేయాల్సింది. తనకు ‘రెడీ’ లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన వైట్ల దర్శకత్వంలో నటించడానికి ఆసక్తిగానే ఉన్నాడు రామ్. కానీ ‘నేను శైలజ’తో మంచి విజయాన్నందుకున్నాక అతడి ఆలోచన మారిపోయింది. ఈ సక్సెస్ ఇచ్చిన ఊపులో వైట్లతో ఎందుకనుకున్నాడో లేక.. కథ నచ్చలేదో కానీ.. ఆ ప్రాజెక్టు నుంచి అతను తప్పుకున్నాడు. ఇదే కథను వైట్ల కొద్దిగా మార్చి వరుణ్ కు చెప్పి ఒప్పించినట్లు సమాచారం. వెంకీ అట్లూరి అనే యువ దర్శకుడితో వరుణ్ చేయాల్సిన ‘ఫీల్ మై లవ్’ కూడా ఇంకొకరి కోసం తయారు చేసిందే అన్న టాక్ ఉంది.
వరుణ్ ఇక్కడ వేరొకరి కోసం రాసిన కథలో నటిస్తుంటే అతడి కోసం రాసిన కథను మార్చి.. సాయిధరమ్ తో సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు గోపీచంద్ మలినేని. గోపీ-వరుణ్ కాంబినేషన్ లో మూణ్నాలుగు నెలల కిందటే ఓకే అయిన సినిమా ఇప్పుడు ఆగిపోయింది. గోపీ ఆ కథతోనే సాయిధరమ్ హీరోగా సినిమా చేస్తున్నట్లు చెబుతున్నారు. మరోవైపు సాయిధరమ్ కోసం తయారు చేసిన ఇంకో కథ వేరే హీరోకు వెళ్లింది. రైటర్ కమ్ డైరెక్టర్ సతీశ్ వేగేశ్న దర్శకత్వంలో ‘శతమానం భవతి’ పేరుతో సాయిధరమ్ హీరోగా దిల్ రాజు ఓ సినిమా నిర్మించాలనుకున్నాడు. కానీ ఎక్కడ తేడా వచ్చిందో కానీ.. ఇప్పుడీ సినిమాలో రాజ్ తరుణ్ నటించబోతున్నాడు.
దిల్ రాజు బేనర్ లోనే ఇంకో పెద్ద ప్రాజెక్టు కూడా ఇలాగే తారుమారైంది. ‘ఎవడో ఒకడు’ పేరుతో రవితేజ హీరోగా దిల్ రాజు ఓ సినిమా లాంఛనంగా మొదలుపెట్టాడు కూడా. ‘ఓ మై ఫ్రెండ్’ ఫేమ్ వేణు శ్రీరామ్ దర్శకుడు. ఐతే ముహూర్తం అయ్యాక ఈ సినిమాకు బ్రేక్ పడింది. రెమ్యూనరేషన్ విషయంలో తేడా వల్లో ఇంకేదో కారణంతోనో రవితేజ ఈ ప్రాజెక్టు నుంచి బయటికి వచ్చేశాడు. ఇప్పుడీ సినిమా కోసం నాగార్జునను సంప్రదించాలనుకుంటున్నాడు రాజు. మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ కోసం ఎంచుకున్న ‘కత్తి’ని ముందు పవన్ కళ్యాణ్ తో చేయాలన్న ప్రపోజల్ వచ్చింది. కానీ అతను ఒప్పుకోలేదు. తర్వాత ఎన్టీఆర్ పేరు తెరమీదికి వచ్చింది. అతడితోనూ కుదర్లేదు. చివరికి చిరంజీవి ‘కత్తి’పై మనసు పడ్డారు. మహేష్ బాబుకు పూరి జగన్నాథ్ ఈ మధ్య ఓ కథ చెప్పి ఒప్పించినట్లు వార్తలొచ్చాయి కదా. ఆ కథ కూడా మహేష్ కోసం రాసింది కాదు. ఎన్టీఆర్ ను హీరోగా అనుకున్నాడు పూరి. కానీ అది అనుకోకుండా మహేష్ దగ్గరికి వెళ్లింది. మరి ఈ తారుమారు కథలు ఎలాంటి ఫలితాన్నిస్తాయో చూడాలి.