Begin typing your search above and press return to search.

కామెంట్‌: ఫ్యాన్స్‌ కోసమే ఈ డైలాగ్స్‌

By:  Tupaki Desk   |   27 Oct 2015 7:00 AM IST
కామెంట్‌: ఫ్యాన్స్‌ కోసమే ఈ డైలాగ్స్‌
X
రేయ్ ! నీ హిస్ట‌రీలో బ్ల‌డ్ ఉందేమో.. నా బ్ల‌డ్‌ లోనే హిస్ట‌రీ ఉంది .. అంటూ డిక్టేట‌ర్ విసిరిన పంచ్‌ లు ప‌రిశీలించారా? మెగా మీట‌ర్ మెగా మీట‌ర్ .. నీలో ఉంది మెగా మీట‌ర్‌.. అంటూ బ్రూస్‌ లీలో సాంగేసుకున్నారు... జాగ్ర‌త్త‌గా గ‌మ‌నించారా? ఇటీవ‌లి కాలంలో ఫ్యాన్స్‌ ని దృష్టిలో ఉంచుకుని మ‌న ర‌చ‌యిత‌లు వేస్తున్న పంచ్‌ లు ఇవ‌న్నీ.

మాస్ మ‌సాలా పంచ్‌ లు ఫ్యాన్స్‌ కి బాగా రుచిస్తాయి. అందుకే మ‌న ద‌ర్శ‌క‌ర‌చ‌యిత‌లు ఏరికోరి మ‌రీ ఇలాంటి పంచ్‌ లు రాయించుకుంటున్నారు. ఎన్టీఆర్‌ - ఏఎన్నార్ టైమ్‌ లో వాళ్ల‌కు అవ‌స‌రం లేనిది చిరంజీవి - వెంక‌టేష్ హ‌యాంలో అక్క‌ర్లేనిది ఇప్పుడు క‌చ్ఛితంగా అవ‌స‌రం అవుతోంది. ఎందుకంటే సెకండ్ జ‌న‌రేష‌న్ మొద‌లైంది మొద‌లు .. 'మా తాత‌లు అది.. మా తండ్రులు ఫ‌లానా..' అని చెప్పుకుని సినిమాకి ప‌బ్లిసిటీ పెంచుకోవాల్సిన స‌న్నివేశం ఉందిప్పుడు.

మావ‌య్య‌ది మొగ‌ల్తూరు, మా నాన్న‌ది పాల‌కొల్లు .. అంటూ గంగోత్రిలో బ‌న్ని ఏకంగా మావ‌య్య‌ను, అర‌విందును పాట‌లోకి లాక్కొచ్చాడు. అక్క‌డ అమ్మాయి. ఇక్క‌డ అబ్బాయి సినిమాతో ప‌వ‌న్ ఎంట్రీ ఇచ్చిన‌ప్పుడు మెగా బ్ర‌ద‌ర్ అన్న కార్డ్‌ ని ఉప‌యోగించారు. ఇలా ప్ర‌తి ఇన్నిడెంట్‌ ని ప‌రిశీలిస్తే క‌చ్ఛితంగా ఆయా సంద‌ర్భాల్లో అవ‌న్నీ ఫ్యాన్స్‌ ని ఆక‌ర్షించేందుకు చేసిన‌వే. అలాగే నాగార్జున న‌టించిన సినిమాల్లో ఏఎన్నార్ ఇమ్మిటేష‌న్ మ‌రీ ఎక్కువ లేక‌పోయినా.. ఇక‌నుంచి అఖిల్ సినిమాల్లో అవి ప‌తాక స్థాయిలో క‌నిపించి తీర‌తాయ‌న్న‌ది ఫ్యాన్స్ వాద‌న‌. మ‌నం సినిమాలో 30 సెక‌న్ల నిడివిలోనే స్ట‌యిలిష్ ఎంట్రీ ఇచ్చిన అఖిల్.. తాత‌తో క‌లిసి ఫ్రేములో క‌నిపించి ప‌ల‌క‌రించ‌డం అన్న‌ది ఫ్యాన్స్‌ కి కిక్కివ్వ‌డానికే.

బాల‌య్య‌బాబు మంగ‌మ్మ‌గారి మ‌న‌వ‌డు నుంచే ఈ క‌ల్చ‌ర్ ఉన్నా.. స‌మ‌ర‌సింహారెడ్డి - న‌ర‌సింహానాయుడు సినిమాల‌తో ప‌రాకాష్ట‌కు చేరుకుంది ఈ ప్ర‌యోగం. మా వంశం అంటూ వంశం గొప్ప‌త‌నాన్ని ఎలివేట్ చేయాల‌నుకోవ‌డం కేవ‌లం ఫ్యాన్స్‌ ని ఉల్లాస‌ర‌ప‌ర‌చ‌డానికే. ఇలా ప‌రిశీలిస్తే నంద‌మూరి అభిమానులు - మెగాభిమానులు - ద‌గ్గుబాటి అభిమానులు - అక్కినేని అభిమానులు .. ఇలా ఫ్యామిలీ ఫ్యాన్స్‌ ను దృష్టిలో పెట్టుకుని డిజైన్ చేసేవే. నాడు మొద‌లైన క‌ల్చ‌ర్ ఇప్ప‌టికీ కొన‌సాగుతోంది. కంటెంట్‌ లో శాతం పెరిగిందంతే.