Begin typing your search above and press return to search.

పంచె కట్టుకు పవర్ ఇచ్చేస్తున్నారు

By:  Tupaki Desk   |   19 July 2017 11:16 AM IST
పంచె కట్టుకు పవర్ ఇచ్చేస్తున్నారు
X
టాలీవుడ్ సినిమా హీరోలు పంచె కట్టుతో అలరించడం పెరుగుతోంది. వరుసగా స్టార్లు పంచెకట్టుతో అలరిస్తున్నారు. అంతే కాదు.. ఆ పంచెలోనే తమ పవర్ కూడా చూపించేస్తున్నారు.

రీసెంట్ గా దువ్వాడ జగన్నాధం మూవీలో.. దాదాపు సినిమా అంతా అల్లు అర్జున్ పంచె కట్టుతో కనిపించాడు. పంచె కట్టు.. విభూది నామాలు.. పైపంచెతో కనిపించిన బన్నీ లుక్ జనాలకు బాగా నచ్చేసింది. ఈ లుక్ కోసం ముందు చాలానే గెటప్ లు పరిశీలించి.. చివరకు దీన్ని ఫైనల్ చేశామని చెప్పాడు బన్నీ. అదే గెటప్ లో కొన్ని యాక్షన్ సీక్వెన్స్ లు కూడా ఉంటే ఆడియన్స్ అలరించవచ్చని ఫీల్ అయ్యారట. అందుకే కీలకమైన ఫైటింగ్ సీన్ ను పంచె కట్టులోనే తీసినట్లు చెప్పాడు.

పవన్ కళ్యాణ్ గత చిత్రం కాటమరాయుడులో.. పవర్ స్టార్ కూడా సినిమా అంతా పంచె కట్టులోనే కనిపిస్తాడు. పల్లెటూరి బ్యాక్ గ్రౌండ్ ఉన్న స్టోరీ కావడంతో.. పంచెతో అయితే బాగుంటుందని సూచించనట్లు దర్శకుడు డాలీ చెబుతున్నాడు. పంచెకట్టుతో పవర్ చూపించడం అనే పాయింట్ పవన్ ను బాగా ఆకట్టుకుందని అంటున్నాడు.

దీనికి ముందు ప్రేమమ్ మూవీలో నాగచైతన్య కూడా పంచెతో కనిపిస్తాడు. కాలేజ్ స్టూడెంట్ గా పంచె కట్టుతో తను కనిపించిన సన్నివేశాల్లో.. రెబల్ మాదిరిగా కనిపిస్తాననని.. గతంలో ఎన్నడూ పంచెకట్టుతో కనిపించకపోవడంతో.. ఆ సన్నివేశాలు మంచి రెస్పాన్స్ వచ్చిందని చెబుతున్నాడు నాగ చైతన్య.

త్వరలో రిలీజ్ కానున్న నేనే రాజు నేనే మంత్రి చిత్రంలో దగ్గుబాటి రానా కూడా పంచెకట్టుతో అలరించనున్నాడు. ఈ కేరక్టర్లో రానా కూడా తన పవర్ చాటనుండడం విశేషం.