Begin typing your search above and press return to search.

గేమ్ డిజైనర్.. ట్రెండ్ కి బెండు తీస్తున్నారు

By:  Tupaki Desk   |   4 March 2016 9:00 PM IST
గేమ్ డిజైనర్.. ట్రెండ్ కి బెండు తీస్తున్నారు
X
తెలుగు సినిమా డైరెక్టర్లకు సినిమా తీయడంలో అన్నిటి కంటే పెద్ద క్వశ్చన్ ఏంటంటే.. హీరోకి ఏ ప్రొఫెషన్ ఏంటనే? కొత్తగా ఏదన్నా దొరికితే దాన్ని పట్టుకుని వేళ్లాడుతూ ఉంటారు. ఇలా మనోళ్లకి దొరికిన కొత్త ప్రొఫెషన్ గేమ్ డిజైనర్. హీరో ఏం చేస్తాడంటే.. గేమ్ డిజైనర్ అని చెప్పేస్తూ ఉంటారు. ఈ కాన్సెప్ట్ తో వరుసగా సినిమాలు జనాల మీద పడిపోతున్నాయి.

ఇలా గేమ్ డిజైనింగ్ ని ఓ ప్రొఫెషన్ గా చూపించిన మొదటి సినిమా ప్రభాస్ మిస్టర్ పర్ ఫెక్ట్. స్టోరీకి పెద్దగా సంబంధం లేకపోయినా.. హీరోకి కనీసం ఓ టీం ఉందని చూపిస్తారు. ధనుష్ అనేకుడు అయితే.. స్టోరీ గేమ్ డిజైన్ ఆఫీస్ చుట్టూనే ఉంటుంది. ఓకే బంగారంలో కూడా హీరో దుల్కర్ సల్మాన్ ఓ గేమ్ తయారు చేసేసి, జనాలకు చూపిస్తాడు కూడా. రీసెంట్ గా విడుదలైన కృష్ణాష్టమిలో సునీల్ ని కూడా గేమ్ డిజైనర్ అనేశారు. బాడీలాంగ్వేజ్ - భాష ఏ మాత్రం మార్చకుండా చూపించడంతో.. ఆల్ మోస్ట్ చిరాకొచ్చేసే పరిస్థితి. ఇప్పుడు కళ్యాణ వైభోగమేలో హీరో నాగశౌర్య ప్రొఫెషన్ కూడా ఇదే. ఈ మాట తప్ప.. ఆ వృత్తికి, సినిమాకి సంబంధం ఉండదు.

అయినా మన సినిమాల్లో హీరో ఒక్కడే గేమ్ తయారు చేసేస్తుంటాడు కానీ.. నిజానికి గేమ్ అంటే ఒక ఐడియా డిజైన్ చేస్తారు. ఆ తర్వాత ఆర్టిస్టులు స్టోరీ బోర్డ్ వేస్తారు. ప్రోగ్రామర్లు గేమింగ్ ఇంజన్లకు రూట్ చేస్తారు. టెస్టింగ్ ఎక్స్ పర్ట్స్ వాటిని పరీక్షిస్తారు. తర్వాత ఓ డిప్లాయ్ మెంట్ ఉంటుంది. ఇదంతా ఏం లేకుండా.. ఏదో ఒక పేరు దొరికిందని దాన్ని పట్టుకుని వేలాడకుండా డైరెక్టర్లూ.. కాస్త దీని గురించి తెలిసినోళ్లంతా నవ్వేసుకుంటున్నారు.