Begin typing your search above and press return to search.

టాలీవుడ్ హీరోలు ఆ హీరోయిన్స్ తో వర్క్ చేయడానికి ఇష్టపడతారా...?

By:  Tupaki Desk   |   8 Oct 2020 3:30 AM GMT
టాలీవుడ్ హీరోలు ఆ హీరోయిన్స్ తో వర్క్ చేయడానికి ఇష్టపడతారా...?
X
టాలీవుడ్ లో పక్క ఇండస్ట్రీల నుంచి హీరోయిన్స్ తెచ్చుకోవడం ఎప్పటి నుంచో వస్తున్నదే. ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాల కోసం ఎక్కువగా బాలీవుడ్ భామల వైపు చూస్తారు. మార్కెట్ దృష్ట్యా క్రేజ్ పరంగా బీ టౌన్ ముద్దుగుమ్మలైతే బాగుంటుందని.. వాళ్ళు డేట్స్ ఇస్తామంటే చాలు డిమాండ్ చేసినంత ముట్టజేప్పడానికి కూడా మేకర్స్ వెనుకాడరు. ఈ మధ్య తెలుగు సినిమా స్థాయి పాన్ ఇండియా లెవల్లో పాకడంతో బాలీవుడ్ హీరోయిన్స్ టాలీవుడ్ కి రావడానికి రెడీగా ఉంటున్నారు. ప్రస్తుతం 'ఆర్.ఆర్.ఆర్' లో అలియా భట్.. ప్రభాస్ - నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్ లో దీపికా పదుకునే.. పూరీ - విజయ్ దేవరకొండ సినిమాలో అనన్య పాండే వంటి బీ-టౌన్ బ్యూటీస్ నటిస్తున్నారు. అయితే ఇప్పుడు టాలీవుడ్ హీరోలు మరియు ఫిలిం మేకర్స్ బాలీవుడ్ హీరోయిన్స్ వైపు చూడటానికి ఆలోచిస్తున్నారని తెలుస్తోంది. ఆల్రెడీ అగ్రిమెంట్ అయినవి పక్కన పెడితే కాకుండా కొత్తగా ఆ హీరోయిన్స్ తో సినిమాలు కమిట్ అవడానికి ముందుకు రావడం లేదని టాక్ నడుస్తోంది.

యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణంతో బాలీవుడ్ ఇండస్ట్రీలో అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. సుశాంత్ మరణానికి నెపోటిజం కారణం అంటూ నెపోటిజం స్టార్స్ పై అక్కడ పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. వాళ్ళు నటించిన సినిమాలపై ఈ నెగెటివిటీ ప్రభావం చూపిస్తోంది. జాన్వీ కపూర్ 'గుంజన్ సక్సేనా : ది కార్గిల్ గర్ల్'.. అలియా నటించిన 'సడక్ 2'.. అనన్య పాండే - ఇషాన్ నటించిన 'ఖాళీ పీలీ' సినిమాలు ఎలాంటి రిజల్ట్ అందుకున్నాయో చూసాం. అందులోనూ అనూహ్యంగా వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ వ్యవహారం కూడా బాలీవుడ్ అంటే ఆలోచించేలా చేస్తోందని టాలీవుడ్ సర్కిల్స్ లో అనుకుంటున్నారు. డ్రగ్స్ కేసులో హీరోయిన్ రియా చక్రవర్తి అరెస్ట్ కాబడి బెయిల్ మీద బయటకు వచ్చింది. అలానే స్టార్ హీరోయిన్స్ దీపికా పదుకునే - శ్రద్ధాకపూర్ - సారా అలీఖాన్ - రకుల్ ప్రీత్ సింగ్ లను కూడా డ్రగ్స్ కేసులో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు విచారించారు.

ఈ నేపథ్యంలో వారిని తీసుకుంటే సినిమాపై ఎఫెక్ట్ పడే అవకాశం ఉందని ఆలోచిస్తున్నారట. నిజానికి జాన్వీ కపూర్ - సారా అలీఖాన్ వంటి హీరోయిన్స్ ని మన హీరోల పక్కన నటింపజేయడానికి చాలా ప్రయత్నాలు జరిగాయి. అయితే ఇప్పుడు ఈ ఇష్యూ వచ్చిన తర్వాత అలాంటి ఆలోచనలు విరమించుకుంటున్నారట. ఇక డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన శాండిల్ వుడ్ హీరోయిన్స్ తో కూడా మన హీరోలు యాక్ట్ చేయడానికి ఇష్ట పడకపోవచ్చని అంటున్నారు. అయితే ఇటీవల రాజమౌళి ఓ ఇంటర్వ్యూలో 'ఆర్.ఆర్.ఆర్' లో అలియా గురించి మాట్లాడుతూ ''తన పర్సనల్ లైఫ్‌ లో ఏమి జరుగుతుందనేది నాకు తెలియదు.. అది నా సినిమాపై ఎఫెక్ట్‌ అవుతుందని అనుకోవడం లేదు. నా సినిమా తన లైఫ్ పై ఎలా ఎఫెక్ట్ అవుద్దో నాకు తెలియదు. సోషల్ మీడియాలో వచ్చే అరుపులు కేకలు పైపైన ఉండేవే. వ్యక్తిగత జీవితంలో ఏదో జరుగుతుందని ఆలోచించి ఆడియెన్స్‌ థియేటర్‌ కు వస్తారని అనుకోవడం లేదు.. దాన్ని బేస్‌ చేసుకుని సినిమా చూడాలని వారు అనుకోరు. సినిమాని ఆర్టిస్టుల అవుట్ సైడ్ లైఫ్ ఎఫెక్ట్ చేస్తుందని నేను నమ్మను'' అని చెప్పుకొచ్చాడు. మరి సినిమాలపై వారి ప్రభావం పడుతుందో లేదో తెలియాలంటే ఇంకొన్నాలు వెయిట్ చేయాల్సిందే.