Begin typing your search above and press return to search.
ఓటీటీ వద్దని నిర్మాత కన్నీళ్లు తుడిచిన హీరో
By: Tupaki Desk | 18 July 2020 11:45 AM ISTనాలుగు నెలలు అవుతోంది ఇప్పటికే. జూలైలోనే వైరస్ ఖతమ్ అవుతుందనుకున్నారు. కానీ మహమ్మారీ విలయం అంతకంతకు పెరుగుతోందే కానీ తగ్గడం లేదు. నేడు రేపు అంటూ ఎదురు చూస్తున్న ఆశావహుల ఆశలపై నీళ్లు చల్లేస్తోంది. వ్యాక్సినేషన్ .. టీకాలు వచ్చేస్తున్నాయి అంటూ ఫార్మా కంపెనీల ప్రకటనలు చూస్తూ ఆశలు పెంచుకుంటున్న వారికి చివరికి నిరాశే మిగులుతోంది. మరో ఏడాది ఏ ఎదురు చూపులు అక్కర్లేదని చెబుతున్నా.. వినోదరంగంలోని వారి ఆశ చావడం లేదు. తమ సినిమాని నేడో రేపో థియేటర్లలో రిలీజ్ చేయాలన్న అభిమతంతోనే ఉన్నారట కొందరు. అది కూడా ఇన్నాళ్ల వెయిటింగుతో నష్టాలు భరించలేక ఓటీటీ రిలీజ్ లకు వెళ్లాలనుకునే నిర్మాతలకు హీరోలతో తలనొప్పిగానే ఉందని తొలి నుంచి వార్తలొస్తున్నాయి.
తాజా సమాచారం ప్రకారం.. ఇప్పటికే దాదాపు 20 సినిమాలు రిలీజ్ లకు సిద్ధంగా ఉన్నా ఏవీ రావడం లేదు. థియేట్రికల్ రిలీజ్ అన్న మోజును ఎవరూ వీడడం లేదట. మొండిగా మంకు పట్టు పట్టారు. ఓ అరడజను మంది హీరోలు నిర్మాతల్ని మభ్య పెడుతున్నారని.. తమ సినిమాల్ని ఓటీటీలో రిలీజ్ చేయనీకుండా మోకాలడ్డేస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. కావాలంటే పారితోషికాలు అయినా తగ్గించుకుంటాం కానీ ఓటీటీ వద్దే వద్దు థియేటర్లే ముద్దు అనేస్తున్నారట.
ఓ ప్రముఖ నిర్మాత ఇద్దరు హీరోల్ని పెట్టి తీసిన క్రేజీ థ్రిల్లర్ సినిమా ఈపాటికే ఓటీటీలో రావాల్సింది. కానీ హీరోలే మోకాలడ్డారట. అసలే మార్కెట్ పెంచుకుంటున్న ఈ టైమ్ లో ఇదేమిటి? కావాలంటే పారితోషికం తగ్గించుకుంటాను. కాస్త ఆగండి మర్రో! అంటూ అందులో ఒక హీరో నిర్మాతను వారించారట. ఎట్టిపరిస్థితిలో థియేట్రికల్ రిలీజ్ చేయాల్సిన సినిమా ఇదని నిర్మాత కన్నీళ్లు తుడిచే ప్రయత్నం చేశారట. ఆ ఓదార్పు మాటలతో వడ్డీల నష్టం భరించేందుకు సదరు నిర్మాత సిద్ధమయ్యారనేది గుసగుస. ఇకపోతే వేరొక నెప్టోయిజం హీరో కోసం పెదనాన్న ఎంత వడ్డీ నష్టపోయినా ఫర్వాలేదనుకుంటూ ఇంకా థియేట్రికల్ రిలీజ్ కోసమే వేచి చూస్తున్నారట. ఇటీవలే ఇస్మార్ట్ బ్లాక్ బస్టర్ కొట్టి మార్కెట్లో పుంజుకున్న తనయుడిని ఎలాగైనా నిలబెట్టాలన్న పంతంతో సినిమాని ఓటీటీలో రిలీజ్ చేసేందుకు సిద్ధంగా లేరట.
సరే.. ఆ ఇద్దరూ అంటే స్టామినా ఉన్న నిర్మాతలు.. కొన్నాళ్లు ఆపారు. ఇంకా ఆపుతారు. మరి మిగతా వారి మాటేమిటి? ఇంకో 18 సినిమాలు ఓటీటీ లో రావాల్సినవే వెయిటింగ్. కొన్నిటికి మార్కెట్ తెగడం లేదు. బేరసారాలు మధ్యలోనే ఆగిపోయాయి. అమెజాన్ .. నెట్ ఫ్లిక్స్ .. జీ 5 .. హాట్ స్టార్ ఎవరో ఒకరు పెద్ద ప్యాకేజీ ముట్టజెప్పకపోతారా? అని వెయిట్ చేసేవాళ్లు లేకపోలేదు. అయినా ఎందుకీ మొండి పట్టు. బెట్టు వీడండయా.. అసలే ఓటీటీలో కిక్కు పెంచే కంటెంట్ లేక బోరింగ్ ఫీలవుతున్నారు ఆడియెన్.