Begin typing your search above and press return to search.

ఈ కుర్ర హీరోకు డైరెక్షన్‌ కోరిక ఉందా ఏంటీ?

By:  Tupaki Desk   |   22 Jun 2020 9:30 AM GMT
ఈ కుర్ర హీరోకు డైరెక్షన్‌ కోరిక ఉందా ఏంటీ?
X
యంగ్‌ హీరో నిఖిల్‌ ఇప్పుడిప్పుడే టాలీవుడ్‌ లో నిలదొక్కుకుంటున్నాడు. సక్సెస్‌ ఫ్లాప్‌ లతో కెరీర్‌ లో ముందుకు వెళ్తున్న నిఖిల్‌ గత చిత్రం అర్జున్‌ సురవరం నిరాశ పర్చింది. ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకో లేక పోయింది. అయినా కూడా నిరాశ పడకుండా తదుపరి చిత్రంను మొదలు పెట్టాడు. వరుసగా సినిమాలు చేస్తూ వెళ్తున్న నిఖిల్‌ తాజాగా సోషల్‌ మీడియాలో అభిమానుల తో ముచ్చటించాడు. ఈ సందర్బంగా పలు విషయాల పై తన స్పందన తెలియ జేశాడు.

ఒక అభిమాని ఈ మూడు నెలల ఖాళీ సమయం లో మీరు ఏం చేశారు అంటూ ప్రశ్నించగా నిఖిల్‌ చాలా నేర్చుకున్నాను. ఈ ఫ్రీ టైంలో నేను ఆన్‌ లైన్‌ ఫిల్మ్‌ మేకింగ్‌ క్లాస్‌ లు విన్నాను. డైరెక్షన్‌ మరియు ఇతర టెక్నికల్‌ విషయాలపై అవగాహణ పెంచుకున్నాను అంటూ నిఖిల్‌ చెప్పాడు. నిఖిల్‌ కెరీర్‌ ఆరంభంలో సహాయ దర్శకుడిగా చేసిన విషయం తెల్సిందే.

ఆ అనుభవంతో నిఖిల్‌ మళ్లీ దర్శకత్వం వహిస్తాడా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. హీరో ఫిల్మ్‌ మేకింగ్‌ కోర్స్‌ ను చేయడం అంటే దర్శకత్వంపై ఆసక్తిని చూపించడమే అంటున్నారు. హీరోగా మరిన్ని ఫ్లాప్స్‌ వస్తే అప్పుడు నిఖిల్‌ దర్శకుడిగా మారే అవకాశం ఉందేమో అంటూ నెటిజన్స్‌ కామెంట్స్‌ చేస్తున్నారు.