Begin typing your search above and press return to search.

టాలీవుడ్ ప్రొడ్యూసర్స్ కోలీవుడ్ ని ఫాలో అయితే బాగుంటుంది కదా...?

By:  Tupaki Desk   |   9 July 2020 6:00 AM GMT
టాలీవుడ్ ప్రొడ్యూసర్స్ కోలీవుడ్ ని ఫాలో అయితే బాగుంటుంది కదా...?
X
ప్రపంచ వ్యాప్తంగా ఏర్పడిన పరిస్థితుల వలన గత నాలుగు నెలలుగా సినీ ఇండస్ట్రీ మూతబడిపోయిన విషయం తెలిసిందే. దీంతో సినిమా షూటింగ్స్ అర్థరంగా ఆగిపోయి ఉన్నాయి. ఇక షూటింగ్ కంప్లీట్ చేసుకున్న సినిమాలు విడుదలకు నోచుకోలేని పరిస్థితి నెలకొని ఉంది. దీంతో సినిమా మీద ఆధారపడి జీవిస్తున్న కుటుంబాల జీవితాలు అస్థవ్యస్తంగా మారిపోయాయి. ప్రొడ్యూసర్స్ పరిస్థితి చాలా దారుణంగా తయారైంది. ఇప్పటికే అనేక మంది ప్రొడ్యూసర్స్ ఇండస్ట్రీలో నెలకొనివున్న పరిస్థితుల కారణంగా దివాళా తీశారు. సినిమా నిర్మాణాలు ఆగిపోవడం.. కంప్లీట్ అయిన మూవీస్ రిలీజ్ అవకపోవడంతో సినిమాకి పెట్టిన పెట్టుబడి ఎక్కడికక్కడే లాక్ అయిపోయింది. దీంతో ఫైనాన్సియర్స్ దగ్గర వడ్డీలకు డబ్బులు తెచ్చి సినిమాలను నిర్మించిన నిర్మాతలు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. థియేటర్స్ రీ ఓపెనింగ్ పై ఇంకా డెసిషన్స్ తీసుకోకపోవడంతో మరికొన్ని నెలలు సినిమాలు థియేటర్స్ లో బొమ్మ పడే అవకాశం లేదు. దీంతో నిర్మాతలు మరింత నష్టపోయే ఛాన్స్ ఉంది. దీని కోసం నష్ట నివారణ చర్యలు చేపట్టాలని సినీ ఇండస్ట్రీ ఆలోచిస్తోంది.

ఈ నేపథ్యంలో తమిళ సినీ ఇండస్ట్రీ పలు కీలక నిర్ణయాలు తీసుకోబోతోందట. సినిమా బడ్జెట్ లో ఎక్కువ భాగం కేటాయించే డైరెక్టర్స్, టెక్నీషియన్స్ హీరో హీరోయిన్ల రెమ్యూనరేషన్ లో కోతలు విధించాలని నిర్ణయం తీసుకుందట. వారి పారితోషకాల్లో ఏకంగా 50 శాతం కోత విధించేలా తమిళ నిర్మాతల సంఘం ఆలోచిస్తుందట. కరోనా కారణంగా ఏర్పడిన విపత్కర పరిస్థితుల నుండి నిర్మాతలు అంతో ఇంతో బయట పడాలంటే హీరోలు మరియు దర్శకుల రెమ్యూనరేషన్స్ లో కోతలు విధించడమే శరణ్యమని వారు భావిస్తున్నారట. దీంతో స్టార్ హీరో హీరోయిన్స్ మరియు స్టార్ డైరెక్టర్స్ తమ పారితోషకాల్లో సగభాగం కోల్పోనున్నారు. అయితే ఇప్పటికే కోలీవుడ్ కి చెందిన పలువురు హీరోలు డైరెక్టర్లు స్వచ్ఛందంగా తమ రెమ్యూనరేషన్స్ తగ్గించుకుంటున్నట్లు ప్రకటించారు. తమిళ ఇండస్ట్రీలో మాదిరి తెలుగు చిత్ర పరిశ్రమలో కూడా అలాంటి నిర్ణయమే తీసుకుంటే సినిమా బడ్జెట్ లో సగం సేవ్ అయినట్లేనని.. నిర్మాతలు కొంతమేర బయటపడే అవకాశాలుంటాయని సినీ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. మరి టాలీవుడ్ పెద్దలు ఆ దిశగా ఆలోచన చేస్తారేమో చూడాలి.