Begin typing your search above and press return to search.

గోపిచంద్.. మరో సాహసం అంటే..?

By:  Tupaki Desk   |   15 Sep 2022 2:30 AM GMT
గోపిచంద్.. మరో సాహసం అంటే..?
X
తెలుగులో మాస్ ఇమేజ్ ఉన్న మంచి హీరోలలో గోపీచంద్ ఒకరు. మొదట విలన్ గా చేసి ఆ తర్వాత రెగ్యులర్ కమర్షియల్ హీరోగా మంచి మార్కెట్ క్రియేట్ చేసుకున్నాడు గోపీచంద్. అయితే అతని బ్యాడ్ లక్ ఏమిటో గాని స్టార్ దర్శకులతో పెద్దగా సక్సెస్ పడింది లేదు. అనుభవం ఉన్న దర్శకులతో చేసినప్పటికీ ఫలితం దక్కలేదు. అప్పట్లో పూరి జగన్నాథ్ తో గోలీమార్ చేశాడు అలాగే కృష్ణవంశీతో మొగుడు చేశాడు. ఆ రెండు కూడా అతని రేంజ్ను పెంచలేదు.

ఇక మిగతా అగ్ర దర్శకులు కూడా అతని పెద్దగా పట్టించుకున్నది లేదు. గత కొంతకాలంగా చూసుకుంటే అతని సినిమాలు ఆర్థికంగా చాలా వరకు నష్టపోతున్నాయి. రీసెంట్ గా వచ్చిన పక్కా కమర్షియల్ సినిమా అయితే దారుణంగా దెబ్బ కొట్టింది. దీంతో గోపీచంద్ నెక్స్ట్ సినిమా విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే మాత్రం మొదటికే మోసం వస్తుంది. ప్రస్తుతం అతనికి ఉన్న ఒకే ఒక్క ప్రాజెక్టు శ్రీనివాస్ దర్శకత్వంలో చేస్తున్నాడు.

లక్ష్యం లౌక్యం సినిమాలతో ఈ కాంబో మంచి సక్సెస్ అందుకున్నప్పటికీ అదే కమర్షియల్ మీటర్స్ తో వస్తే మాత్రం ఇప్పుడు ఏమాత్రం వర్కౌట్ కావు. అలాగే శ్రీనువైట్ల అని అంటున్నారు కానీ ఇంకా ఆ విషయంలో కూడా క్లారిటీ లేదు. అయితే గోపీచంద్ కు చాలా మంచి స్నేహం ఉన్న దర్శకులలో చంద్రశేఖర్ యేలేటి ఒకరు. వీరి కాంబోలో వచ్చిన ఒక్కడున్నాడు హిట్ కాదు కాని అదొక డిఫరెంట్ మూవీ. ఇక సాహసం పెట్టిన పెట్టుబడిని వెనక్కి తెచ్చింది.

అయితే గతంలో వీళ్ళిద్దరూ సాహసం సినిమాకు సీక్వెల్ తీస్తే బాగుంటుంది అని చర్చలు కూడా జరిపారు. చంద్రశేఖర్ కు అప్పటికే నితిన్ తోపు కమిట్మెంట్ ఉండడంతో చెక్ అనే సినిమా తీశాడు. ఆ సినిమా తర్వాత సాహసం 2 చేద్దామని కూడా అనుకున్నారు.

కానీ చెక్ సినిమా ఎలాంటి ఫలితాన్ని ఇచ్చిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక అందులోనూ గోపీచంద్ కూడా వరుస అపజయాలు ఎదుర్కొంటున్నాడు. ఇక వీరిపై సాహసం రేంజ్ లో మళ్లీ 30 కోట్ల వరకు పెట్టుబడి పెట్టాలి అంటే చాలా కష్టమైన పని. కానీ సాహసంకు ఉన్న హైప్ ను ఉపయోగించి సీక్వెల్ ను ప్రమోట్ చేసి తీసుకోస్తే బజ్ హై రేంజ్ లో ఉండవచ్చు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.