Begin typing your search above and press return to search.

టాలీవుడ్ గ్లామర్ డాల్ డబుల్ డోస్ అందాలు.. వైరల్!

By:  Tupaki Desk   |   26 May 2021 8:30 AM GMT
టాలీవుడ్ గ్లామర్ డాల్ డబుల్ డోస్ అందాలు.. వైరల్!
X
సినీ ప్రపంచంలో గ్లామర్ పరంగా రోజురోజుకి ఎన్ని మార్పులు జరుగుతున్నాయో సినీతారల అభిమానులకు తెలిసిందే. అందులోను ఏ హిందీ - తమిళ - కన్నడ లాంటి ఇండస్ట్రీలలో హీరోయిన్స్ గ్లామర్ ఒలికించే పాళ్ళు వేరేలా ఉంటాయి. కానీ తెలుగులో అలా కాదు. ఇదివరకు తెలుగులో తెలుగు అమ్మాయిలకు ఛాన్స్ దొరకాలంటే అరుదుగా జరిగేవి. ఒకవేళ దొరికినా హీరోయిన్ కాకుండా ఇతర పాత్రల్లో మెరిసేవారు. కానీ ఇప్పుడు తెలుగుమ్మాయిలు కూడా సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి గ్లామర్ షో చేయడానికైనా సిద్ధమే అంటూ సిగ్నల్ ఇచ్చేస్తున్నారు. ఎందుకంటే ఒకసారి గ్లామర్ ప్రపంచంలోనే కెరీర్ అని ఫిక్స్ అయితే ఖచ్చితంగా స్కిన్ షో - ఇతర మసాలా అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది.

మరి ఇప్పుడు అదేబాటలో టాలీవుడ్ బ్యూటీ తనను తాను ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేస్తోంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో 'అంతకుముందు ఆ తర్వాత' అనే మూవీతో అరంగేట్రం చేసిన తెలుగు బ్యూటీ ఈషారెబ్బ. ఫస్ట్ సినిమానే యాక్టింగ్ పరంగా స్కోప్ ఉండేసరికి మంచి గుర్తింపు దక్కించుకొని మెల్లగా తనంతట తానే అవకాశాలు రాబట్టుకుంటోంది. కానీ కెరీర్ ప్రారంభించి ఇన్నేళ్లు గడిచినా ఇప్పటివరకు ఆ జోరేమీ కనిపించలేదు. ఇప్పుడు కూడా ఈషా కెరీర్ నెమ్మదిగానే సాగుతుంది. ప్రేక్షకులను మరిపించే అందం చందం ఉన్నప్పటికీ ఈషా.. హీరోయిన్ గా సరైన బ్రేక్ కోసం ట్రై చేస్తోంది. ఇప్పుడైతే వచ్చిన అవకాశాలు వదులుకోకుండా చేస్తూ పోతుంది. ఆ విధంగానే అప్పటినుండి బందిపోటు - అమితుమీ - అరవిందసమేత - రాగల24గంటల్లో లాంటి సినిమాలు చేసింది. కానీ ఏ ఒక్కటి ఈషాను స్టార్ చేయలేకపోయాయి. లాభం లేదని ఆ మధ్యన తమిళంలో ట్రై చేసింది.

మొన్నటివరకు గ్లామర్ పరంగా హద్దులు పెట్టుకున్న ఈషా.. ఇటీవలే సినిమా కోసం అందాల ఆరబోతకు సిద్ధ‌మంటూ సిగ్న‌ల్స్ ఇచ్చేసిందని టాక్. మాయామాల్ అనే సినిమాలో ఈషా గ్లామ‌ర‌స్ పాత్రలో క‌నిపించింది. అలాగే ఈ ఏడాది పిట్టకథలు అనే వెబ్ సిరీస్ లో నటించింది. చేసింది బోల్డ్ పాత్రే అయినప్పటికీ ఈషాకు ఎలాంటి పేరు తేలేదు ఆ వెబ్ సిరీస్. అన్నీ ఉన్నా కూడా తెలుగ‌మ్మాయి అనేది ఈషాకు అడ్డుగోడగా మారిందని టాక్. అందుకే ఇన్నేళ్ళైనా అమ్మడికి సరైన బ్రేక్ లభించలేదు. అయితే సోషల్ మీడియాలో ఈషా చాలా యాక్టీవ్. తనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ దృష్టిలో పెట్టుకొని గ్లామరస్ ఫోటోషూట్స్ తో హ్యాపీ చేస్తోంది. అయితే తాజాగా అమ్మడు అదిరే గ్లామర్ షో పిక్స్ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఇప్పటివరకు ఈషా ఎన్ని ఫోటోలు పెట్టినా ఇందులోనే హాట్ డోస్ పెంచిందని నేటిజన్లు అంటున్నారు. తాజాగా లింగరీ ధరించి బ్లాక్ టాప్ లో అలా పార్కులో ఈషా సోయగాల వడ్డింపు వేడెక్కిస్తోంది. మరి ఇలాంటి అందాలకు ఎప్పుడు ఫుల్ స్కోప్ లభిస్తుందో చూడాలి. ప్రస్తుతం అమ్మడు తమిళంలో ఓ సినిమా చేస్తోంది.