Begin typing your search above and press return to search.

ఆ రెండు సినిమాలు సంక్రాంతికే టార్గెట్..!

By:  Tupaki Desk   |   21 Oct 2022 12:30 AM GMT
ఆ రెండు సినిమాలు సంక్రాంతికే టార్గెట్..!
X
సంక్రాంతి వచ్చింది అంటే సినిమా సందడి షురూ అయినట్టే. టాలీవుడ్ బాక్సాఫీస్ కళకళలాడే ఆ పండుగ రోజుల్లో కనీసం ఒక మూడు నుంచి నాలుగు సినిమాలు రిలీజ్ ప్లాన్ చేస్తారు. దాదాపు వారం పాటు హాలీడేస్ ఉన్న కారణంగా పండుగకు రెండు రోజుల ముందు నుంచి సినిమాల హడావిడి స్టార్ట్ అవుతుంది. కొన్ని సినిమాలు సంక్రాంతికి వారం ముందు కూడా రిలీజ్ ప్లాన్ చేస్తారు. 2023 సంక్రాంతికి ఇప్పటికే భారీ సినిమాలు రిలీజ్ ఫిక్స్ చేసుకున్నాయి. రేసులో ప్రభాస్ ఆదిపురుష్.. మెగాస్టార్ వాళ్తేర్ వీరయ్య.. పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు.. విజయ్ వారసుడు సినిమాలు ఉన్నాయి.

ప్రభాస్ ఆదిపురుష్ ఈమధ్య రిలీజైన టీజర్ లో వి.ఎఫ్.ఎక్స్ సరిగా లేవని విపరీతమైన ట్రోల్స్ రాగా వాటిని సరిచేసేందుకు సంక్రాంతి రిలీజ్ మిస్ చేస్తారని ఎక్స్ క్లూజివ్ న్యూస్. మరోపక్క పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు సినిమాకు సంబందించి చేయాల్సిన షూటింగ్ పార్ట్ చాలా ఉందని ఆ మూవీని కూడా సంక్రాంతి రేసు నుంచి తప్పిస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. చిరు వాళ్తేర్ వీరయ్య ఇంకా షూటింగ్ పెండింగ్ ఉంది దాదాపు అది కూడా పొంగల్ రిలీజ్ కష్టమని టాక్.

ఇక దళపతి విజయ్ వారసుడు సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ లో మాత్రమే రిలీజ్ డేట్ వేశారు కానీ ఆ తర్వాత సైలెంట్ అయిపోయారు. వారసుడు కూడా సంక్రాంతి రేసు నుంచి డ్రాప్ అయినట్టే అని అంటున్నారు. శంకర్, చరణ్ సినిమా ముందు సంక్రాంతి రిలీజ్ అనుకున్నా అది కాస్త సమ్మర్ కి షిఫ్ట్ చేసుకున్నారు.

ఇలా సంక్రాంతికి రిలీజ్ అనుకున్న నాలుగైదు సినిమాలు ఏవో కారణాల వల్ల వాయిదా పడుతున్నాయని టాక్. ఇదే ఛాన్స్ అన్నట్టుగా అసలు రేసులో లేని రెండు భారీ సినిమాలు పొంగల్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నాయి. అవేంటి అంటే ఒకటి బాలకృష్ణ 107వ సినిమా కాగా.. మరొకటి అఖిల్ ఏజెంట్ మూవీ.

గోపీచంద్ మలినేని డైరక్షన్ లో బాలయ్య బాబు చేస్తున్న మాస్ మూవీ ఎన్.బి.కె 107. క్రాక్ హిట్ తో జోరు మీద ఉన్న గోపీచంద్ మలినేని బాలకృష్ణతో అంతకుమించి హిట్ కొట్టాలని గట్టి ప్రయత్నం చేస్తున్నాడు. సైరా నరసింహా రెడ్డి తర్వాత సురేందర్ రెడ్డి చేస్తున్న ఏజెంట్ మూవీ కూడా స్పై థ్రిల్లర్ నేపథ్యంతో వస్తుంది.

ఈ రెండు సినిమాలు అసలైతే ఈ ఏడాది చివర్లో రిలీజ్ అనుకోగా సంక్రాంతి కి రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. మరి అసలు 2023 సంక్రాంతికి ఏ సినిమా రిలీజ్ అవుతుంది ఏది వాయిదా పడుతుంది అన్నది త్వరలో తెలుస్తుంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.