Begin typing your search above and press return to search.

బాక్సాఫీస్ ఫైట్ లో మెగా నందమూరి వార్.. వెనకపడ్డ దగ్గుబాటి అక్కినేని స్టార్స్..!

By:  Tupaki Desk   |   19 Oct 2022 11:30 PM GMT
బాక్సాఫీస్ ఫైట్ లో మెగా నందమూరి వార్.. వెనకపడ్డ దగ్గుబాటి అక్కినేని స్టార్స్..!
X
టాలీవుడ్ లో నాలుగు పెద్ద ఫ్యామిలీలు.. మెగా నందమూరి దగ్గుబాటి అక్కినేని. ఈ నాలుగు ఫ్యామిలీస్ నుంచి వచ్చిన స్టార్స్ ఇండస్ట్రీని ఏలేస్తున్నారు. మెగా ఫ్యామిలీ నుంచి మెగా వారసుడు చరణ్ మాత్రమే కాదు ఆ వరుసలో చాలామంది హీరోలు ఉన్నారు. ఓ పక్క మెగాస్టార్ చిరంజీవి సినిమాలు చేస్తుండగా చరణ్, అల్లు అర్జున్, వరుణ్ తేజ్, సాయి ధరం తేజ్, వైష్ణవ్ తేజ్ ఇలా అందరు తమ సినిమాలతో మెగా ఫ్యాన్స్ ని అలరిస్తున్నారు.

బాక్సాఫీస్ ఫైట్ లో మెగా ఫ్యామిలీ రెడీ అంటుంది. ఆర్.ఆర్.ఆర్ సినిమాతో చరణ్, పుష్ప సినిమాతో అల్లు అర్జున్ ఇద్దరు పాన్ ఇండియా స్టార్స్ అయ్యారు. సో మెగా ఫ్యామిలీలోనే స్టార్స్ మధ్యే బాక్సాఫీస్ ఫైట్ తప్పేలా లేదు.

ఇక తెలుగు సినిమా చరిత్రలో నందమూరి ఫ్యామిలీది ఒక ప్రత్యేకమైన ప్రస్థానం ఉంది. పెద్దాయన ఎన్.టి.ఆర్ నుంచి జూనియర్ ఎన్.టి.ఆర్, కళ్యాణ్ రాం వరకు నందమూరి ఫ్యాన్స్ ని.. ప్రేక్షకులను అలరించాలని నందమూరి హీరోలు ప్రయత్నిస్తున్నారు. బాలయ్య బాబు తొడ కొడితే రికార్డులు బ్రేక్ అవుతాయి. ఈమధ్య ఆయన స్టైల్ మార్చి కొత్త ట్రై చేస్తున్నారు. బాక్సాఫీస్ వేటలో నందమూరి ఫ్యామిలీ కూడా తమ మార్క్ చూపిస్తుంది. ఎన్.టి.ఆర్ అయితే ఆర్.ఆర్.ఆర్ తో నేషనల్ వైడ్ క్రేజ్ తెచ్చుకోవడమే కాకుండా సూపర్ ఫ్యాన్స్ ని ఏర్పరచుకున్నాడు.

తెలుగు సినిమా పరిశ్రమలో దగ్గుబాటి వారిది ప్రత్యేకమైన శైలి. మూవీ మొఘల్ రామానాయుడు గారు మొదలు పెట్టిన ఈ ప్రస్థానంలో సురేష్ బాబు నిర్మాతగా కొనసాగుతుండగా వెంకటేష్ విక్టరీ ని తన ఇంటిపేరుగా మార్చుకుని సత్తా చాటుతున్నాడు. ఇదే క్రమంలో రానా కూడా ఇమేజ్ చట్రంలో ఇరుక్కుపోకుండా హీరోగా.. విలన్ గా.. విలక్షణ పాత్రలు చేస్తూ మెప్పిస్తున్నాడు. టాలీవుడ్ సినీ పరిశ్రమలో దగ్గుబాటి ఫ్యామిలీ ఎవర్గ్రీన్ అని చెప్పొచ్చు.

ఇక అక్కినేని ఫ్యామిలీ గురించి చెప్పుకుంటే ఏయన్నార్ సినీ లెగసీని కొనసాగించడంలో సూపర్ సక్సెస్ అయ్యారు నాగార్జున. పాత్ర ప్రాధాన్యత ఉంటే హీరోగానే కాదు కాళ్లు చేతులు పడిపోయి వీల్ చెయిర్ కే అంకితమైన పాత్రల్లో కూడా చేయడానికి రెడీ అంటూ నాగ్ తన సత్తా చాటాడు. టాలీవుడ్ మన్మథుడు అంటూ అనిపించిన ఆయనే అన్నమయ్య, రామదాసు సినిమాలు చేసి సూపర్ అనిపించారు.

నాగార్జున తర్వాత వచ్చిన నాగ చైతన్య లవర్ బోయ్ ఇమేజ్ తో వరుస సినిమాలు చేస్తుండగా.. అఖిల్ మాత్రం స్టార్ ఇమేజ్ కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ నాలుగు ఫ్యామిలీలు తెలుగు సినిమా పరిశ్రమలో ఒక మార్క్ క్రియేట్ చేశారు. అంతేకాదు హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఫ్యామిలీ స్టార్స్ కూడా వీరే అని చెప్పొచ్చు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.