Begin typing your search above and press return to search.
నవదీప్ ని అందుకే టార్గెట్ చేస్తున్నారా...?
By: Tupaki Desk | 14 Sept 2020 12:45 PM ISTబాలీవుడ్ డ్రగ్ వ్యవహారం శాండిల్ వుడ్ మీదుగా టాలీవుడ్ కు పాకింది. డ్రగ్స్ కేసులో ఇప్పటికే బాలీవుడ్ హీరోయిన్ రియా చక్రవర్తి మరియు శాండిల్ వుడ్ నటీమణులు రాగిణి ద్వివేది - సంజన గల్రాని అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పేరుని కూడా రియా వెల్లడించినట్లు నేషనల్ మీడియాలో వరుస కథనాలు వెలువడ్డాయి. దీంతో నెటిజన్స్ కొందరు రకుల్ పై తమదైన రీతిలో ట్రోల్స్ చేశారు. అందులోనూ ఇటీవల నటి మాధవీలత మాట్లాడుతూ టాలీవుడ్ లో డ్రగ్స్ లేకుండా పార్టీలు జరగవని సంచలన వ్యాఖ్యలు చేసింది. దీంతో టాలీవుడ్ లో కూడా డ్రగ్స్ వ్యవహారం త్వరలోనే బయటకు వస్తుందంటూ సోషల్ మీడియాలో డిస్కషన్ చేసుకున్నారు. ఈ క్రమంలో ఓ నెటిజన్ యువ హీరో నవదీప్ ని టార్గెట్ చేస్తూ ''రకుల్ - మంచు - రానా - నవదీప్.. మళ్ళీ టాలీవుడ్ లో ఇది యూ టర్న్ తీసుకుంటుంది. నవదీప్ అన్నా మనకి ఈ బాధలు తప్పేలా లేవు. కొంచం జాగ్రత్త'' అని ట్వీట్ చేశాడు. దీనికి నవదీప్ స్పందిస్తూ ''నాకు ఏం బాధ లేదు బ్రదర్. నువ్వు కూడా ఏ బాధ పడకు.. పదా పనొచ్చే పనులు చేసుకుందాం'' అని కౌంటర్ ఇచ్చాడు.
కాగా డ్రగ్ వ్యవహారంలో నవదీప్ ని టార్గెట్ చేయడానికి కారణం గతంలో టాలీవుడ్ సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసు అని తెలుస్తోంది. మూడేళ్ళ క్రితం డ్రగ్స్ మాఫియాతో సంబంధాలు ఉన్నాయంటూ పలువురు టాలీవుడ్ ప్రముఖులకు తెలంగాణ ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సిట్ అధికారులు నోటీసులు జారీ చేసి విచారించారు. దీంట్లో ప్రముఖంగా పూరీ - ఛార్మి - రవితేజ - తరుణ్ - నవదీప్ - ముమైత్ ఖాన్ సహా పలువురి పేర్లు వినిపించాయి. వీరందరూ సిట్ అధికారులు విచారణకు హాజరై వివరణ కూడా ఇచ్చుకున్నారు. అయితే ఆ కేసులో ఎవరిని అరెస్ట్ చేయలేదు. నవదీప్ అప్పుడు టాలీవుడ్ డ్రగ్ వ్యవహారంలో విచారణకు హాజరయ్యాడు కాబట్టి ప్రెజెంట్ నడుస్తున్న డ్రగ్ ఇష్యూలో అతన్ని ట్రోల్ చేస్తున్నారని తెలుస్తోంది. అయితే నవదీప్ మాత్రం వీటిని పెద్దగా పట్టించుకోకుండా 'నాకు బాధ ఏం లేదు బ్రదర్. నువ్వు కూడా ఏ బాధ పడకు.. పనొచ్చే పనులు చేసుకుందాం పదా' అంటూ కూల్ గా సమాధానం ఇచ్చాడు.