Begin typing your search above and press return to search.
టాలీవుడ్ లో మళ్లీ ఎన్నికల హడావిడీ షురూ!
By: Tupaki Desk | 13 Sept 2022 8:00 AM ISTతెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఎన్నికల యమ జోరుగా జరుగుతూ అటెన్షన్ ని క్రియేట్ చేయడం తెలిసిందే. `మా` ఎన్నికలే ఇందుకు మంచి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. రెండేళ్లుకు ఒకసారి జరిగే ఈ ఎన్నికల వేళ ఎలాంటి రభస జరుగుతుందో జయసుధ వర్సెస్ రాజేంద్ర ప్రసాద్ నుంచి మంచు విష్ణు వర్సెస్ ప్రకాష్ రాజ్ వరకు చూశాం. అయితే `మా` ఎన్నికల వేళ కనిపించిన వేడి మిగతా ఎన్నికల్లో కనిపించదు. కానీ ఈ సారి ఎఫ్ ఎన్ సీసీ (ఫిలిం నగర్ కల్చరల్ క్లబ్) ఎన్నికల వేళ అలాంటి వాతావరణమే కనిపించేలా వుంది.
ఇందులో మొత్తం 4400 మంది సభ్యులున్నారు. సినీ సెలబ్రిటీస్ కు తప్ప ఇందులో సామాన్యులకు చోటు లేదు. జీవిత కాల సభ్యత్వం కోసం ఇందులో రూ. 16 లక్షలు చెల్లించాల్సిందే. నందమూరి తారక రామారావు హయాంలో ఈ క్లబ్ ని ఏర్పాటు చేశారు. ఫిలిం నగర్ లో ఫ్లాట్లు సొంతం చేసుకున్న వాళ్లకే సభ్యత్వం అని తేల్చినా ఆ తరువాత బయటి నుంచి బడా బాబులు కూడా ఈ క్లబ్ లో మెంబర్స్ గా చేరారు. అయితే బయటి వారు ఓటింగ్ లో పాల్గొనమని, పోటీ పడమని అఫిడవిట్ ఇచ్చాకే చేర్చుకున్నారు.
అంటే సభ్యత్వం కోసం బయటి బడాబాబులు లక్షలు చెల్లించాలి కానీ ఓటింగ్ హక్కు, పోటీ చేసే హక్కుని అడగరాదన్నమాట. దీంతో గత కొన్నేళ్లుగా సినిమాలు తీయని వారిదే అక్కడ అధికారంగా మారుతూ వస్తోంది. ఇందులో ఓటింగ్ వున్న వారు 2400 మంది వుంటే ఓటింగ్ లేని వారు 2000 ఉన్నారు. అందరికి ఓటింగ్ ఇస్తే ఇంత వరకు పెత్తనం చెలాయిస్తున్న వారికి ఇబ్బందులు తప్పవు.. దీంతో సగం మంది నుంచి సభ్యత్వం రూపంలో లక్షలు కట్టించుకున్నా వారికి మాత్రం ఓటింగ్ హక్కు, పోటీ చేసే హక్కుని ఇవ్వడం లేదు.
ఇప్పటి వరకు ఒకే సామాజిక వర్గానికి చెందిన వారే అక్కడ ఎత్తనం చెలాయిస్తూ వస్తున్నారు. ఈ వ్యవహారాలపై గతంలో కొంత మంది కోర్టుని ఆశ్రయించారు. ప్రసన్నకుమార్ వేసిన కేసు ఇప్పటికీ పెండింగ్ లోనే వుంది. తాజాగా ఎఫ్ ఎన్ సీసీ క్లబ్ కు ఎన్నికలు నిర్వహించనున్న నేపథ్యంలో బైలాని మార్చాలనే డిమాండ్ లు వినిపిస్తున్నాయి. దీంతో కొత్త రభస మొదలైంది. ప్రస్తుతం అధ్యక్షుడిగా వున్న ఆదిశేషగిరిరావునే మళ్లీ పోటీలో దింపేస్తున్నారు.
డి. సురేష్ బాబు పోటీకి దిగినా ఆయనకు నచ్చచెప్పి మాన్పించేశారు. దీంతో కొత్త డిమాండ్ లు మొదలయ్యాయి. స్థానికత, కమ్మ సామాజిక వర్గం, ఆంధ్రా, తెలంగాణ ఇలా సమీకరణాలు మొదలయ్యాయి. చూస్తుంటే `మా`ని మించి ఎఫ్ ఎన్ సీసీ క్లబ్ ఎన్నికలు కొత్త రచ్చకు తెర తీసేలా వున్నాయనే కామెంట్ లు వినిపిస్తున్నాయి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.