Begin typing your search above and press return to search.
టాలీవుడ్ డ్రగ్స్ కేసు: ఈడీ ఎవరిని ఎప్పుడు విచారిస్తుందంటే..?
By: Tupaki Desk | 26 Aug 2021 12:06 PM IST2017లో టాలీవుడ్ లో సెన్సేషల్ క్రియేట్ చేసిన డ్రగ్స్ వ్యవహారం.. నాలుగేళ్ళ తర్వాత మళ్ళీ తెరపైకి వచ్చింది. తెలంగాణ ఎక్సైజ్ అధికారులు క్లీన్ చిట్ ఇచ్చిన ఈ కేసులో ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రంగంలోకి దిగింది. ఎక్సైజ్ శాఖకు చెందిన సిట్ దాఖలు చేసిన చార్జ్ షీట్ల ఆధారంగా ఇప్పుడు మనీల్యాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) కింద కేసు నమోదు చేశారు. ఇందులో భాగంగా ఆరోపణలు ఎదుర్కొన్న పది మంది సినీ ప్రముఖులు సహా 12 మందికి బుధవారం ఈడీ సమన్లు జారీ చేసింది.
టాలీవుడ్ కు చెందిన పూరీ జగన్నాథ్ - రానా దగ్గుబాటి - రవితేజ - రకుల్ ప్రీత్ సింగ్ - చార్మి కౌర్ - నవదీప్ - ముమైత్ ఖాన్ - తనీష్ - తరుణ్ - నందు లతోపాటు రవితేజ డ్రైవర్ శ్రీనివాస్ మరియు ఎఫ్ క్లబ్ జనరల్ మేనేజర్ లను ఈడీ విచారణకు హాజరుకావాలని నోటీసులలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. వీరందరినీ ఆగస్టు 31 నుంచి సెప్టెంబరు 22 వరకు ఈడీ విచారించనున్నట్టు తెలుస్తోంది. డ్రగ్స్ క్రయవిక్రయాలకు సంబంధించి మనీలాండరింగ్ జరిగిందనే కోణంలో వీరిని ప్రశ్నిస్తారు. అయితే ఈడీ వీరిని కేవలం సాక్షులుగానే పరిగణించి విచారణకు పిలిచినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం మీడియాలో ప్రచారం జరుగుతున్న కథనాల ప్రకారం డ్రగ్స్ వ్యవహారంలోని మనీల్యాండరింగ్ కేసులో ఈడీ ఎవరెవరిని ఎప్పుడు విచారిస్తుందంటే..
ఆగస్టు 31 - పూరి జగన్నాథ్
సెప్టెంబర్ 2 - ఛార్మి కౌర్
సెప్టెంబర్ 6 - రకుల్ ప్రీత్ సింగ్
సెప్టెంబర్ 8 - రానా దగ్గుబాటి
సెప్టెంబర్ 9 - రవితేజ
సెప్టెంబర్ 9 - శ్రీనివాస్ (రవితేజ డ్రైవర్)
సెప్టెంబర్ 13 - నవదీప్
సెప్టెంబర్ 13 - ఎఫ్ క్లబ్ జీఎం
సెప్టెంబర్ 15 - ముమైత్ ఖాన్
సెప్టెంబర్ 17 - తనీష్
సెప్టెంబర్ 20 - నందు
సెప్టెంబర్ 22 - తరుణ్
కాగా, 2017 జూలై 2న హైదరాబాద్ లో డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఎక్సైజ్ అధికారులు అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో అనేక మంది సినీ ప్రముఖులకు డ్రగ్స్ విక్రయించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఏర్పాటైన సిట్ పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలను విచారించింది. ఈఈ కేసులో మొత్తం 12 కేసులు నమోదు కాగా.. 11 కేసుల దర్యాప్తు పూర్తి చేసి చార్జిషీట్లు దాఖలు చేశారు. అయితే ఇందులో టాలీవుడ్ ప్రముఖులు ఎవరినీ కూడా నిందితులుగా చేర్చలేదు. అయితే అప్పటి చార్జిషీట్ల ఆధారంగా మనీల్యాండరింగ్ చట్టం కింద ఇప్పుడు ఈడీ విచారణ చేపట్టనుంది.