Begin typing your search above and press return to search.

సీనియర్ హీరోలకోసం దర్శకుల కష్టం మాములుగా లేదుగా..!

By:  Tupaki Desk   |   3 March 2021 3:30 AM GMT
సీనియర్ హీరోలకోసం దర్శకుల కష్టం మాములుగా లేదుగా..!
X
టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం కొనసాగుతున్న సీనియర్ హీరోలకోసం దర్శకులు బాగా కష్టపడుతున్నారట. ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలయ్య, విక్టరీ వెంకటేష్, కింగ్ నాగార్జున లాంటి హీరోలకు హీరోయిన్లను వెతికే విషయంలో టాలీవుడ్ డైరెక్టర్స్ అందరూ ఫెయిల్ అవుతున్నారు. వయసు మీదపడిన హీరోలకు సరిజోడిని సెట్ చేయాలంటే తలప్రాణం తోకలోకి వస్తుందని అంటున్నారట. అసలే వరుసగా సినిమాలు లైన్ లో పెట్టారు ఈ సీనియర్ హీరోలు. అలాగే ఈ సీనియర్ హీరోలు కూడా వారి వయసులకు అనుగుణంగా ఉండే కథలను ఎంపిక చేసుకుంటున్నారు. కానీ కమర్షియల్ సినిమాలకు మాత్రం యంగ్ హీరోయిన్స్ అవసరం. స్టార్ హీరోలతో సినిమాలు సెట్ చేసుకుంటున్న దర్శకులకు హీరోయిన్లను వెతకడం కష్టమే అవుతోందట.

బాలకృష్ణ కోసం బోయపాటి శీను చాలా కష్టపడి ఆఖరికి ప్రగ్యాజైస్వాల్ ను ఓకే చేసాడు. మెగాస్టార్ ఆచార్య విషయంలో కూడా అదే జరిగింది కానీ ఆఖరికి కాజల్ అగర్వాల్ లైన్ లోకి వచ్చింది. ఇప్పుడు లూసిఫర్ విషయంలో కూడా డైరెక్టర్ చాలా వెతుకుతున్నారు. అలాగే కింగ్ నాగార్జున వైల్డ్ డాగ్ సినిమాకోసం కూడా హీరోయిన్స్ దొరకక బాలీవుడ్ దియామీర్జాను పిలిపించారు మేకర్స్. ఆమె ఇంతవరకు తెలుగులో కనిపించలేదు. అయితే తాజాగా బాలయ్యతో డైరెక్టర్ గోపీచంద్ మలినేని ఓ మాస్ స్క్రిప్ట్ ఓకే చేయించాడు. కానీ ఇప్పుడు హీరోయిన్ కోసం వెతుకులాట తప్పట్లేదు. నాగార్జున ప్రవీణ్ సత్తారు సినిమాలో కూడా హీరోయిన్ ఖరారు కాలేదు. ఇక వెంకటేష్ సరసన దృశ్యం-2లో మీనా నటించబోతుంది. మొత్తానికి టాలీవుడ్ స్టార్ హీరోలకు హీరోయిన్ను సెట్ చేయాలంటే డైరెక్టర్స్ నానాతంటాలు పడుతున్నారట. ప్రస్తుతం ఈ అంశం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.