Begin typing your search above and press return to search.
'హిట్టు'కోసం లైన్ లో ఉన్న టాలీవుడ్ డైరెక్టర్స్..!
By: Tupaki Desk | 29 May 2021 11:00 AM ISTసినిమా ఇండస్ట్రీలో ఎవరికైనా హిట్స్ ఉన్నప్పుడే ఆ క్రేజ్ వేరేలా ఉంటుంది. అది ఓ డైరెక్టర్ - హీరో - హీరోయిన్ - టెక్నీషియన్ - కమెడియన్ ఇలా ఏ ఒక్కరికైనా సక్సెస్ బాటలో ఉన్నప్పుడే పూల వర్షం కురిపిస్తారు. అదే వరుస ప్లాప్స్ లో ఉంటే మాత్రం ఇంతకాలం ఒకటిగా కనిపించిన వారు కూడా అలా దూరంగా ఉంటారు. లేదా తర్వాత సినిమాకు ట్రై చేద్దాంలే అంటుంటారు. ఇదంతా అందరికి తెలిసిన విషయమే. ఇలాంటివి సినిమా ఇండస్ట్రీలోనే ఎక్కువగా కనిపిస్తుంటాయి. అయితే ముఖ్యంగా డైరెక్టర్స్ విషయంలో పరిస్థితి దారుణంగా మారుతుంది. నిజానికి డైరెక్టర్స్ తీసే అన్ని సినిమాలు హిట్ అవ్వాలని లేదు. అలాగని ప్లాప్స్ అవుతాయని లేదు. కానీ అదృష్టం బాలేక వరుస ప్లాప్స్ పడితే మాత్రం ఖచ్చితంగా హిట్టు కొట్టి ప్రూవ్ చేసుకోవాల్సిందే. ప్రస్తుతం అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నారు పలువురు టాలీవుడ్ డైరెక్టర్స్.
1. శ్రీకాంత్ అడ్డాల: 2008లో కొత్తబంగారులోకం సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు శ్రీకాంత్. ఆ తర్వాత రెండో ప్రయత్నంగా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో మరో హిట్ ఖాతాలో వేసుకున్నాడు. కానీ ఆ తర్వాతే ఎదురైంది అసలు చేదు అనుభవం. 2016లో మహేష్ బాబు హీరోగా బ్రహ్మోత్సవం సినిమా తీసాడు. అది కాస్తా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అయ్యింది. ప్రస్తుతం విక్టరీ వెంకటేష్ తో తమిళ సూపర్ హిట్ అసురన్ మూవీ 'నారప్ప'గా రీమేక్ చేస్తున్నాడు. మరిప్పుడు హిట్ కొడతాడేమో చూడాలి.
2. బొమ్మరిల్లు భాస్కర్: కెరీర్ ప్రారంభంలోనే బొమ్మరిల్లు - పరుగు సినిమాలతో సూపర్ హిట్స్ అందుకున్నాడు భాస్కర్. ఆ తర్వాత ఆరేంజ్ - ఒంగోలుగిత్త సినిమాలు చేసి ప్లాప్స్ ఖాతాలో వేసుకున్నాడు. దాదాపు 8ఏళ్ల తర్వాత తెలుగులో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా చేస్తున్నాడు. ఇందులో అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్నాడు.
3. క్రిష్: కెరీర్ ప్రారంభం నుండి వరుసగా గాయం - వేదం - కంచె - గౌతమిపుత్ర శాతకర్ణి సహా పలు సినిమాలు తెరకెక్కించాడు క్రిష్. కానీ బాలయ్యతో అన్నగారు ఎన్టీఆర్ బయోపిక్ రెండు భాగాలు ప్లాప్ అవ్వడంతో ప్రస్తుతం హిట్ కోసం ట్రై చేస్తున్నాడు. ప్రస్తుతం పవన్ కల్యాణ్ తో హరిహర వీరమల్లు - పంజా వైష్ణవ్ తేజ్ తో ఓ సినిమా చేస్తున్నాడు.
4. మెహర్ రమేష్: ఈ డైరెక్టర్ కెరీర్లో కంత్రి - బిల్ల సినిమాలు తప్ప మిగతావి నిరాశపరిచాయి. ఎన్టీఆర్ తో శక్తి - వెంకటేష్ తో షాడో సినిమాలు తీసి ప్లాప్ డైరెక్టర్స్ లిస్టులో చేరిపోయాడు. దాదాపు 8ఏళ్ల తరవాత వేదాలం సినిమాను మెగాస్టార్ చిరంజీవితో రీమేక్ చేసే పనిలో ఉన్నాడు.
5. గుణశేఖర్: తెలుగు ఇండస్ట్రీలో 20ఏళ్లకు పైగా దర్శకుడుగా కొనసాగుతున్నాడు గుణశేఖర్. అయితే 2015లో రుద్రమదేవి సినిమా ఆశించిన స్థాయిలో హిట్ కాలేదు. 6ఏళ్లకు ఇప్పుడు సమంతతో శాకుంతలం - రానాతో హిరణ్యకశప అనే సినిమాలు ప్లాన్ చేసాడు.
6. చందు మొండేటి: ఫస్ట్ మూవీ కార్తికేయతో సూపర్ హిట్ అందుకున్నాడు డైరెక్టర్ చందు. ఆ తర్వాత అక్కినేని హీరోతో ప్రేమమ్ లాంటి డీసెంట్ సినిమా తీశాడు. కానీ మళ్లీ చైతూతో సవ్యసాచి తీసాడు కానీ అది ప్లాప్ గా నిలిచింది. ప్రస్తుతం హిట్ కొట్టాలనే కసితో కార్తికేయ సీక్వెల్ రెడీ చేస్తున్నాడు.
7. హను రాఘవపూడి: అందాలరాక్షసి, కృష్ణగాడి వీరప్రేమగాధ సినిమాలతో హిట్స్ అందుకున్న డైరెక్టర్ హను.. తర్వాత లై - పడిపడి లేచె మనసులతో ప్లాప్స్ ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం దుల్కర్ సల్మాన్ తో ఆర్మీ బ్యాగ్రౌండ్ మూవీ ప్లాన్ చేసాడు.
8. సుధీర్ వర్మ: ఫస్ట్ మూవీ స్వామిరారా తోనే సూపర్ హిట్ అందుకొని ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించాడు సుధీర్. కానీ ఆ తర్వాత తీసిన దోచేయ్ - కేశవ - రణరంగం సినిమాలు పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. ప్రస్తుతం సుధీర్ కూడా హిట్ గురించి ట్రై చేస్తున్నాడు. కానీ ఇంకా ఏ సినిమా ప్రకటించలేదు సుధీర్.
9. సుజీత్: డెబ్యూ మూవీ రన్ రాజా రన్ తో సూపర్ హిట్ అందుకున్నాడు సుజీత్. కానీ ఆ వెంటనే పాన్ ఇండియా సినిమా చేసి నిరాశపరిచాడు. సాహో సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు. ప్రస్తుతం హిట్ కొట్టాలనే ఆలోచనలో ఉన్నాడు. ఇంకా తదుపరి సినిమా ప్రకటించలేదు.