Begin typing your search above and press return to search.

సినిమాలు హోల్డ్ లో పెట్టి వెబ్ సిరీస్ డైరెక్ట్ చేస్తున్నారా...?

By:  Tupaki Desk   |   8 Oct 2020 3:11 PM IST
సినిమాలు హోల్డ్ లో పెట్టి వెబ్ సిరీస్ డైరెక్ట్ చేస్తున్నారా...?
X
డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్స్ హవా స్టార్ట్ అయిన తర్వాత ఫిలిం మేకర్స్ అందరూ ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. సౌత్ ఇండస్ట్రీలో ఈ ట్రెండ్ కాస్త లేట్ గా మొదలైనా లాక్ డౌన్ కారణంగా ఊపందుకుంది. ఈ క్రమంలో టాలీవుడ్ డైరెక్టర్స్ కూడా వెబ్ సిరీసులు తీయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే పలువురు తెలుగు దర్శకులు వెబ్ ఫిలిమ్స్ తీసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో ఇద్దరు యువ దర్శకులు వెబ్ వరల్డ్ లో అడుగుపెట్టనున్నారని తెలుస్తోంది. ఇండస్ట్రీలో మంచి స్నేహితులుగా చెప్పుకునే డైరెక్టర్స్ చందు మొండేటి - సుధీర్ వ‌ర్మ లు త్వరలో వెబ్ సిరీస్ లను డైరెక్ట్ చేయబోతున్నారని సమాచారం.

'కార్తికేయ' 'ప్రేమమ్' 'సవ్యసాచి' వంటి చిత్రాలను అందించిన చందు మొండేటి.. 'కార్తికేయ 2' ప్రాజెక్ట్ అనౌన్స్ చేసాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ - వివేక్ కూచిభోట్ల‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు ప్రకటించారు. అయితే కారణాలు తెలియదు కానీ ఈ ప్రాజెక్ట్ ని హోల్డ్ లో పెట్టి అదే ప్రొడక్షన్ హౌస్ లో నివేథా పేతురాజ్ తో ఓ లేడీ ఓరియెంటెడ్ మూవీ స్టార్ట్ చేశాడు. చందు ఈ సినిమాని సింగిల్ షెడ్యూల్ లో కంప్లీట్ చేసి వెంటనే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కోసం ఓ వెబ్ సిరీస్ ని డైరెక్ట్ చేయడానికి ఒప్పుకున్నాడని ఫిలిం సర్కిల్స్ లో అనుకుంటున్నారు.

మరోవైపు కెరీర్ స్టార్టింగ్ నుండి డిఫరెంట్ స్టోరీలను తెరకెక్కిస్తూ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న సుధీర్ వర్మ కు ఓ వెబ్ సిరీస్ ని క్రియేట్ చేయనున్నారని తెలుస్తోంది. నిజానికి సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ లో సుధీర్ ఓ సినిమా చేయాల్సి ఉంది. రెజీనా కాసాండ్రా - నివేదా థామస్ ప్రధాన పాత్రలుగా 'మిడ్ నైట్ రన్నర్స్' అనే కొరియన్ చిత్రాన్ని సుధీర్ రీమేక్ చేయబోతున్నారని.. త్వరలోనే షూటింగ్ కూడా మొదలు కానుందని న్యూస్ వచ్చింది. అప్పటి నుంచి ఈ సినిమా గురించి అటు డైరెక్టర్ నుండి కానీ ఇటు ప్రొడక్షన్ హౌస్ నుంచి కానీ ఎటువంటి అప్డేట్ లేదు. అయితే ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం ప్రస్తుతానికి ఆ ప్రాజెక్ట్ ని హోల్డ్ లో పెట్టి సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ కోసం సుధీర్ ఓ వెబ్ ఫిల్మ్ డైరెక్ట్ చేయనున్నాడట. మరి ఈ వార్తల్లో నిజమెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే.