Begin typing your search above and press return to search.

మీడియా అటెన్షన్ కోసమా ఈ పాకులాట?

By:  Tupaki Desk   |   7 Aug 2019 7:59 AM GMT
మీడియా అటెన్షన్ కోసమా ఈ పాకులాట?
X
హీరో అయినా దర్శకుడు అయినా వాళ్ళ గురించి సదరు సినిమాలు మాట్లాడాలి తప్ప ఇంకేవి కాదు. హంగులు ఆర్భాటాలు తాత్కాలికంగా పబ్లిసిటీ ఇస్తాయేమో కానీ చిరకాలం గుర్తుండిపోయేలా చేసేవి మూవీస్ మాత్రమే. కానీ ఇటీవలి కాలంలో కొందరు దర్శకులు హీరోలు తమ క్యారవాన్లు ఆఫీస్ ఇంటీరియర్లు చూపించుకోవడం కోసం మీడియా కెమెరాలను పిలిచి స్పెషల్ కవరేజ్ ఇవ్వడం ఇప్పుడు ఫిలిం నగర్ కొత్త చర్చకు దారి తీస్తోంది.

అతనో మీడియం రేంజ్ స్టార్ డైరెక్టర్. హీరో పాత్రకు ఏదో ఒక వ్యాధి పెట్టి ఆ పాయింట్ చుట్టూ కథలు అల్లుకుని సూపర్ హిట్స్ తో మొదలుపెట్టి డిజాస్టర్స్ దాకా వచ్చాడు. మధ్యలో ఓ సీనియర్ స్టార్ హీరో బంగారం లాంటి ఛాన్స్ ఇస్తే మూస కథతో దాన్ని వృధా చేసుకున్నాడు. ఇప్పుడో యూత్ హీరోతో సినిమా చేస్తున్నాడు కానీ ఇద్దరూ ఖచ్చితంగా హిట్ కావాల్సిన అవసరం ఉన్నవాళ్లే

ఇక విషయానికి వస్తే ఈ దర్శకుడు కొత్తగా ఓ ఆఫీస్ తీసుకున్నాడు. ఖరీదైన ఇంటీరియర్స్ ని డిజైన్ చేయించి అబ్బో అనుకునేలా సువిశాలంగా తీర్చి దిద్దుకున్నాడు. అతని టేస్ట్ బాగుంది. అందులో నెగటివ్ కామెంట్ కి ఆస్కారం లేదు. కానీ ఇలా మీడియాలోని ఓ ఛానల్ ని పిలిచి ఇదుగో ఇదే నా ఆఫీస్ అంటూ అన్ని యాంగిల్స్ లో వీడియో తీయించి దాని తర్వాత స్పెషల్ గా ఇంటర్వ్యూ ఇవ్వడం ఏమిటోనని కామెంట్స్ గట్టిగా వినిపిస్తున్నాయి.

మీడియా అటెన్షన్ కోసమే ఇలా ఆఫీసులను చూపించడం తప్ప సాధారణంగా ప్రేక్షకులకు వీటి మీద పెద్ద ఆసక్తి ఉండదు. ఇటీవలే ఓ స్టార్ హీరో క్యారవాన్ పిక్స్ వైరల్ అయితే తర్వాత వాటిని అందరూ మర్చిపోయారు. అంత పెద్ద హీరోవే ఎవరికి పట్టలేదు ఇప్పుడీ దర్శకుడి ఆఫీస్ గురించి ఎవరికి కావాలి అనేదే సదరు కామెంట్స్ లోని సారాంశం. అంతే ఎవరి ఆనందం వాళ్ళది అనుకోవడం తప్ప ఎవరైనా చేసేదేముంది