Begin typing your search above and press return to search.

సినిమాలే ఫ‌ట్టు.. బిజినెస్‌ హిట్టే!

By:  Tupaki Desk   |   14 Sep 2015 10:30 PM GMT
సినిమాలే ఫ‌ట్టు.. బిజినెస్‌ హిట్టే!
X
టాలీవుడ్ లో అత‌డి ఎంట్రీ ఓ సెన్సేష‌న్. అంతా కొత్త వాళ్ల‌తోనే ప‌నిచేస్తాడు. కొత్త హీరోల్ని ప‌రిచ‌యం చేస్తుంటాడు. స్టార్ డైరెక్ట‌ర్లంటే అత‌డికి విర‌క్తి. ఎప్ప‌టికీ స్టార్ ల‌తో సినిమాలు చేయ‌న‌ని ప్ర‌క‌టించాడు. ఒక‌వేళ ప్ర‌య‌త్నించినా అవేవీ వ‌ర్క‌వుటవ్వ‌లేదు. ఆరంభం వ‌రుస‌గా బోలెడ‌న్ని బ్లాక్‌ బ‌స్ట‌ర్ లు కొట్టేసిన ఈ డైరెక్ట‌ర్ ఇటీవ‌లి కాలంలో వ‌రుస ఫ్లాపుల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్నాడు. ఇప్ప‌టికీ కొత్త హీరోల్ని ప‌రిచ‌యం చేస్తున్నాడు. కానీ ఫ్లాపులే ఎదురవుతున్నాయ్‌.

లేటెస్టుగా రిలీజైన అత‌డి సినిమా ప్ర‌తికూల ఫ‌లితాన్నే అందుకుంది. అయితే స‌ద‌రు డైరెక్ట‌ర్ సినిమా ఫీల్డులో ఫెయిలైనా ఫైనాన్సియ‌ర్‌ గా మాత్రం బాగానే స‌క్సెస‌వుతున్నాడ‌న్న టాక్ వినిపిస్తోంది. లేటెస్టుగా అత‌గాడు ఏపీ క్యాపిట‌ల్ సిటీ విజ‌య‌వాడ‌లో బోలెడంత డ‌బ్బు జ‌ల్లేస్తున్నాడు. అక్క‌డ రియ‌ల్ వ్యాపారం ఊపందుకుంది కాబ‌ట్టి పెట్ట‌బడుల్ని పెడుతున్నాడు. భారీ వెంచ‌ర్ ల‌లో బోలెడ‌న్ని కోట్లు కుమ్మ‌రిస్తున్నాడ‌ట‌. అక్క‌డ ఓ టాప్ పొలిటీషియ‌న్‌ తో చేతులు క‌లిపి ఈ పెట్టుబ‌డులు పెడుతున్నాడు. అత‌డికి హైద‌రాబాద్ ప‌రిస‌రాల్లో బోలెడ‌న్ని ఆస్తులున్నాయ్‌.

టాలీవుడ్‌ లో అడుగుపెట్ట‌క ముందే ముంబై ప‌రిశ్ర‌మ‌లో కెమెరామేన్‌ గా ప‌నిచేసిన అత‌డు బాగానే సంపాదించాడు. అక్క‌డ టాప్ డైరెక్ట‌ర్లంద‌రితో ప‌నిచేసిన‌ప్పుడు సంపాదించింది బాగానే వెన‌కేసాడు. ఇప్పుడు అదే సొమ్ములు రియ‌ల్ వెంచ‌ర్ ల‌లోకి వెళుతున్నాయి. టాలీవుడ్‌ లో సంపాదించిన‌ది అత‌డికి బోన‌స్ మాత్ర‌మే. మొత్తానికి సినిమాల్లో కొట్టేయ‌క‌పోయినా రియ‌ల్ ఎస్టేట్‌ లో కొట్టేస్తున్నాడు! సేఫ్ బిజినెస్‌ ని తెలివిగా బాగానే లాగించేస్తున్నాడు.